ETV Bharat / bharat

Boy Was Dead in Culvert at Hyderabad : బాచుపల్లి వద్ద నాలాలో గల్లంతైన బాలుడు మృతి..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 3:02 PM IST

Updated : Sep 5, 2023, 6:14 PM IST

Boy Missing
Boy Was Missing in Culvert at Hyderabad

14:50 September 05

Boy Was Dead in Culvert at Hyderabad : హైదరాబాద్​లో భారీ వర్షం.. బాచుపల్లి వద్ద నాలాలో పడిన బాలుడు మృతి

Boy Was Missing in Culvert at Hyderabad హైదరాబాద్​లో భారీ వర్షం.. కల్వర్టులో పడి బాలుడు అదృశ్యం

Boy Was Dead in Culvert at Hyderabad : మేడ్చల్​ జిల్లాలోని బాచుపల్లి​లో నాలాలో కొట్టుకుపోయిన మిథున్​ రెడ్డి(4) అనే బాలుడు మృతి చెందాడు. ప్రగతినగర్​ తురక చెరువులో బాలుడి మృతదేహం డీఆర్​ఎఫ్​ సిబ్బందికి లభ్యమయింది. మధ్యాహ్నం బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, స్థానికులు వెతికారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఆర్​ఎఫ్​(DRF) బృందాలు బాలుడి కోసం గాలించాయి. బాలుడి ఆచూకీ లభించిన.. తను మాత్రం ప్రాణాలతో లేకపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సంతోష్​ రెడ్డి దంపతుల కుమారుడు మిథున్​ రెడ్డి ​. ఓ ఫార్మా కంపెనీలో ఆయన పని చేస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటూ పక్కనే ఉన్న నాలాలో బాలుడు పడిపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు గాలింప సాగారు.

Boy Dead at Medchal : నాలాలో పడే అవకాశం ఏమైనా ఉందా అనే అనుమానంతో చుట్టుపక్కల సీసీ ఫుటేజ్​లను పరిశీలించారు. అందులో బాలుడు నాలాలో పడిపోయిన దృశ్యాలు గుర్తించారు. ఆ కాలువ సాయినగర్​- గృహకల్ప వైపు వెళ్లే నాలాలో కలుస్తుంది. దీంతో స్థానికులు ఆ చుట్టు పక్కల ఉన్నవారితో కలిసి గాలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు జీహెచ్​ఎంసీ డీఆర్​ఎఫ్​ బృందాలకు సమాచారం అందించారు. అక్కడ సహాయక బృందాలు ఆలస్యంగా రావడంతో.. స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్​ఎఫ్​ బృందాలు గాలింపులో భాగంగా నాలా కలిసే కిలోమీటరు దూరంలో ఉన్న తురక చెరువు వద్ద గాలింపు చర్యలు ప్రారంభించారు.

సీసీ కెమెరాలో దృశ్యాలు : సీసీ కెమెరాలా ముందు పెద్దాయన నడుస్తుంటే వెనుకనే బాలుడు కూడా నడుస్తున్నాడు. ఆ విషయాన్ని ఆ వ్యక్తి గుర్తించకుండా నాలాను దాటాడు.. వెంటనే ఆ వెనుక ఉన్న మిథున్​ నాలాను దాటలేక అందులో పడి రెప్పపాటులో కొట్టుకుపోయాడు. ఆ విషయం ముందున్న వ్యక్తి కనీసం గుర్తించలేదు. లేకపోతే బాలుడు ప్రాణం నిలిచే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.

Boy Died After Falling In Water Tank Mahabubabad : పండుగపూట విషాదం.. నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి

గాలింపు చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద : బాలుడు నాలాలో అదృశ్యమైన విషయాన్ని తెలుసుకున్న కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానంద ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలుడు ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. మిథున్​ ఆచూకీ కోసం సహాయక సిబ్బంది చేస్తున్న చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇంకా ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : వర్షాలు పడేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటి నుంచి బయటకు రాకుండా చేయాలి. లేకపోతే వారు నాలాలు, మ్యాన్​ హోల్, కాలువలు వంటి వాటిలో పడిపోయి.. ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కావున వర్షాలు పడే అన్ని రోజులు పిల్లలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచడం మంచిది. అలాగే అధికారులు కూడా నాలాలు, మ్యాన్​ హోల్​లు, కాలువలు మూసి ఉంచాలి. లేకపోతే అవి తెరిచి ఉంటే అక్కడ తగిన ముందస్తు సూచికను ఏర్పాటు చేయాలి. ప్రత్యేక పిల్లల విషయంలో తల్లిదండ్రులు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేస్తే బాగుంటే.. మంచిదని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Auto Driver Killed by Falling Tree Live Video : ఆటోలపై కుప్పకూలిన భారీ వృక్షం.. డ్రైవర్‌ మృతి

సంగారెడ్డి జిల్లాలో యువకుడు గల్లంతు : మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం మంజాపూర్​ వద్ద యువకుడు గల్లంతు అయ్యాడు. చెరువు అలుగు దాటుతూ వరదలో యువకుడు కొట్టుకుపోయాడు. గల్లంతైన సుధాకర్​ కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా ఇతని ఆచూకీ లభించకపోవడం సహాయ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి.

Huge Traffic in Hyderabad Rains : వరుణ్ బ్రో కొంచెం గ్యాప్​ తీసుకో.. ఈ ట్రాఫిక్​లో ఇళ్లు చేరేదెలా..?

Two Workers Stuck in Vaagu Viral Video : అకస్మాత్తుగా వరద.. వాగు మధ్యలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు.. చివరకు..!

Last Updated :Sep 5, 2023, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.