ETV Bharat / bharat

భాజపా నేత కుమారుడి హత్య.. నిందితుడి ఇళ్లు కూల్చేసిన అధికారులు

author img

By

Published : Mar 24, 2022, 5:33 PM IST

BJP leader's son killed
BJP leader's son killed

BJP leader Son Killed: రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో జోక్యం చేసుకున్న భాజపా నేత కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్​ ఇందోర్​లో జరిగిందీ ఘటన.

BJP leader Son Killed: మధ్యప్రదేశ్​ ఇందోర్​లో దారుణ ఘటన జరిగింది. స్థానిక నేత, భాజపా కిసాన్​ మోర్చా మహూ బ్లాక్​ ప్రెసిడెంట్​ ఉదల్​ సింగ్​ ఠాకుర్​ కుమారుడు సుజిత్​ ఠాకుర్​(22) హత్యకు గురయ్యాడు. రెండు వర్గాల మధ్య ఘర్షణలో జోక్యం చేసుకోగా.. దుండగులు సుజిత్​పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. కిషన్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని వివరించారు. మరో నలుగురికి గాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఘటనా స్థలం వద్ద అదనపు సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు.

ఇదీ జరిగింది: బోర్​వెల్​ తవ్వకానికి సంబంధించి కుల్​దీప్​ ఠాకూర్​, రాజా వర్మ అలియాస్​ రాజు ఖటిక్​ వర్గాల మధ్య ఘర్షణ మొదలైందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఖటిక్, అతని అనుచరులు సుజిత్​ తలపై ఐరన్​ రాడ్లతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడని, కుల్​దీప్​ పరిస్థితి కూడా విషమంగా ఉందని వెల్లడించారు. 'రాజా వర్మ, లోకేశ్​ వర్మ, మాల్​కేశ్​ వర్మ, మన్ను, రోహిత్​ బన్వారి, రాజ్​ కపూర్​, రాకేశ్​ డాన్​లపై కేసు నమోదు చేశాం. ప్రధాన నిందితుడు రాజు ఖటిక్​ను అరెస్టు చేశాం. మిగతా వారి కోసం గాలిస్తున్నాం.' అని స్పష్టం చేశారు. ఈ ఘటన అనంతరం.. గ్రామంలో ప్రధాన నిందితుడి అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొన్నారు మధ్యప్రదేశ్​ హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా. నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు.

ఇవీ చూడండి: ఆ ఒక్క పిల్లితో రూ. 100 కోట్ల నష్టం.. ఎలా?

లక్ అంటే ఈ పిల్లవాడిదే​.. బస్సు చక్రాల కింద పడినా..

రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యాయత్నం- కానిస్టేబుల్ సాహసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.