ETV Bharat / bharat

అమెరికాలో సైనికాధికారి పేరిట రూ.1.24 కోట్లు టోకరా

author img

By

Published : Sep 14, 2020, 9:57 AM IST

Woman posing as 'US official' dupes Gurugram man of Rs 1.24 cr
అమెరికాలో సైనికాధికారి పేరిట రూ.1.24 కోట్లు టోకరా

సైబర్ నేరాలపై ఎంతో అవగాహన కల్పిస్తున్నప్పటికీ... కేటుగాళ్ల వలలో పడి ఇప్పటికీ చాలా మంది మోసపోతున్నారు. తాజాగా హరియాణా గురుగ్రామ్​కు చెందిన ఓ వ్యక్తి... సైబర్ ​కేడీ వలలో పడి రూ.1.24 కోట్లు పోగొట్టుకున్నాడు.

హరియాణా గురుగ్రామ్​లోని చకర్​పుర్​ గ్రామానికి చెందిన ధీరేంద్ర​ కుమార్​... సైబర్​ మోసానికి గురై రూ.1.24 కోట్లు పోగొట్టుకున్నాడు. పునామ్​మెకేలా ​ పేరుతో వచ్చిన మెసేజ్​లను నమ్మిన ఆయన భారీ మొత్తంలో సొమ్మును పోగొట్టుకున్నాడు.

సందేశం పంపి...

ధీరేంద్ర​ కుమార్​కు... పునామ్​ మెకేలా పేరుతో వాట్సాప్​కు ఓ సందేశం వచ్చింది. తెరిచి చూస్తే 'అమెరికాలో సైనికాధికారిణిగా పని చేస్తున్న తాను... భారత్​లో ఔషధ సంస్థను స్థాపించాలనుకుంటున్నాను. దీని కోసం 8.7మిలియన్​ డాలర్లు మీకు పంపుతాను' అని అందులో ఉంది. ఆ తర్వాత అమెరికా నుంచి ఓ బాక్సు రాగా.. దానికి కొంత డబ్బు చెల్లించాలంటూ... 2020 జూన్​ 19 నుంచి జులై 17 వరకు పలు మెసేజ్​లు వచ్చాయి. దీంతో ఆన్​లైన్​ ద్వారా డబ్బు చెల్లించినట్లు ధీరేంద్ర పేర్కొన్నాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... పునామ్​ మెకేలా పేరుతో మెసేజ్​లు పంపిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు ఇటువంటి సైబర్ ​మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు గురుగ్రామ్​ పోలీసులు.

ఇదీ చూడండి: అందరికీ అందని ఆన్‌లైన్‌ బోధన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.