ETV Bharat / bharat

శీతాకాలం సభ: పౌరసత్వం బిల్లే ప్రధాన అజెండా!

author img

By

Published : Nov 17, 2019, 2:51 PM IST

Updated : Nov 17, 2019, 10:06 PM IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు వంటి అంశాలను సభలో లేవనెత్తాలని విపక్షాలు చూస్తున్నాయి.

శీతాకాలం సభ: పౌరసత్వం బిల్లే ప్రధాన అజెండా!

శీతాకాలం సభ: పౌరసత్వం బిల్లే ప్రధాన అజెండా!

జమ్ముకశ్మీర్​లో పరిస్థితి, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, పౌరసత్వ బిల్లుపై విపక్షాల విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుండగా... కొన్ని కీలక బిల్లులకు ఆమోదం పొందే లక్ష్యంతో అధికార పక్షం వ్యూహాలు రచిస్తోంది.

కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు

శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఆమోదింపజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు యోచిస్తోంది. రెండు ఆర్డినెన్సులను చట్టాలుగా మార్చాలనుకుంటోంది.
పొరుగుదేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రూపొందించింది కేంద్రం. గత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతతో ఆమోదం పొందలేదు.

ఆర్డినెన్సులు

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు స్వదేశీ సంస్థలకు కార్పొరేట్​ పన్ను తగ్గిస్తూ సెప్టెంబరులో నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ ఆర్డినెన్సును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చట్టంగా మార్చే అవకాశముంది.

భారత్​లో ఈ-సిగరెట్ల తయారీ, వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ సెప్టెంబరులోనే మరో ఆర్డినెన్సు తీసుకువచ్చింది మోదీ సర్కారు. దీనిని ఈ పార్లమెంటు సమావేశాల్లో చట్టంగా మార్చనుంది.

తొలి సమావేశం చారిత్రకం...

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ముమ్మారు తలాక్ బిల్లు, జాతీయ భద్రత సంస్థకు మరిన్ని అధికారాలిచ్చే బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి.

జమ్ముకశ్మీర్​కు​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు , ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లు కూడా తొలి సమావేశాల్లోనే ఉభయ సభల ఆమోదం పొందింది.

ఇదీ చూడండి: ప్రధానితో 'బంధం' గురించి జెన్నిఫర్​ చెప్పిన కథ ఇది!

Shivamogga (Karnataka), Nov 17: The unseasonal rains have wreaked havoc in Karnataka by not only disturbing the daily life of the people but also destroying the maize farms, which is one of the major commercial crops of the state. The incessant rain in early harvesting season from September to November has caused severe damage which has made the yield per hectare nose dive and the remaining produce to be sold off at lower rates. While speaking to ANI, a farmer narrated his ordeal and said, "This year rain has really devastated our life, more than 50 per cent of the maize crop has been destroyed, the price also dipped, the clouds developing in the evening are threatening the farmers from harvesting. A few days back maize was being sold at Rs 2,600 per quintal but now it has come down to just Rs 1,200." Karnataka is the leading producer and exporter of maize in the country. The waterlogging, which happened due to incessant rains and floods, adversely affected the crops and also makes the plants more vulnerable to pest attacks.
Last Updated : Nov 17, 2019, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.