ETV Bharat / bharat

వైరల్​: వృద్ధురాలి అంత్యక్రియల్లో వానరాల ఓదార్పు

author img

By

Published : Oct 3, 2020, 1:34 PM IST

Updated : Oct 3, 2020, 5:09 PM IST

ప్రస్తుత కరోనా సమయంలో ఎవరైనా మరణిస్తే కుటుంబ సభ్యులు, బంధువులే వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే.. ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో కొన్ని వానరాలు పాల్గొని దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాయి. హృదయాల్ని కదిలించే సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Monkeys appear to console mourners at a funeral in UP
వృద్ధురాలి అంత్యక్రియల్లో వానరాల ఓదార్పు

కరోనా మహమ్మారి సమయంలో ఎవరైనా అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతే.. వారి అంత్యక్రియలకు కనీసం దగ్గరి బంధువులు కూడా వెళ్లలేని పరిస్థితులు తలెత్తాయి. అయితే.. మేమున్నామంటూ ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో పాల్గొన్నాయి వానరాలు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను కోతులు ఓదార్చాయి. హృదయాల్ని హత్తుకునే సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

వృద్ధురాలి అంత్యక్రియల్లో వానరాల ఓదార్పు

ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​ జిల్లా లాల్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బెల్హా గ్రామంలో ఓ వృద్ధురాలు మరణించింది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ సమయంలో కొన్ని కోతులు అక్కడికి చేరుకున్నాయి. కొన్ని వానరాలు మృతదేహం చుట్టూ కూర్చోవటం, ఓ వానరం ఏకంగా మృతదేహం ఉన్న మంచంపై కూర్చుని కొంత సమయం పాటు అక్కడే ఉంది. దుఃఖంలో ఉన్నవారిని వానరాలు ఓదార్చుతున్నట్లు కనిపించింది.

Monkeys appear to console mourners at a funeral in UP
వృద్ధురాలి అంత్యక్రియల్లో వానరాల ఓదార్పు

సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఈ వింతను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి సంఘటన తమ గ్రామంలో గతంలో ఎన్నడూ జరగలేదని.. ఇది దేవుడి లీలగా పేర్కొన్నారు. వృద్ధురాలి మృతదేహం చుట్టూ సుమారు రెండు గంటల పాటు కూర్చుని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఊరంతా విలుకాళ్లే.. గురి అంతా లక్ష్యంపైనే!

Last Updated : Oct 3, 2020, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.