ETV Bharat / bharat

జీఎస్​టీ బకాయిల కోసం విపక్షాల ధర్నా

author img

By

Published : Sep 17, 2020, 3:14 PM IST

రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్​టీ బకాయిలను చెల్లించాలని కోరుతూ విపక్షాలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ఎదుట ధర్నాకు దిగారు. తృణమూల్​ కాంగ్రెస్​, తెరాస, ఆర్​జేడీ సహా పలు ప్రాంతీయ పార్టీల సభ్యులు నిరసనలో పాల్గొన్నారు.

TRS, TMC, DMK, RJD, AAP, NCP, Samajwadi Party and Shiv Sena MPs protest in front of Mahatma Gandhi statue
జీఎస్​టీ బకాయిలు చెల్లించాలంటూ పార్లమెంటు ఎదుట ధర్నా

జీఎస్​టీ బకాయిలు చెల్లించాలంటూ విపక్షాలు పార్లమెంటు ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగాయి. ప్రాంతీయ పార్టీలు తృణమూల్​ కాంగ్రెస్​, తెరాస, డీఎంకే, ఆర్​జేడీ, ఆప్​​, ఎన్​సీపీ, సమాజ్​వాదీ, శివసేన పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు.

ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయన్న నేతలు.. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

జీఎస్​టీ బకాయిలు చెల్లించాలంటూ పార్లమెంటు ఎదుట ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.