ETV Bharat / bharat

కరోనా కయ్యం: అమిత్​ భాయ్​కు దీదీ గ్యాంగ్​ సవాల్​

author img

By

Published : May 10, 2020, 11:01 AM IST

Updated : May 10, 2020, 1:14 PM IST

కరోనా సహాయ చర్యల విషయంలో భాజపా, టీఎంసీ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. వలస కార్మికుల రైళ్లను రాకుండా మమత సర్కార్​ అడ్డుకుంటోందన్న అమిత్​ షా ఆరోపణలను టీఎంసీ ఖండించింది. వాటిని రుజువు చేయాలని సవాలు విసిరింది.

TMC dares Shah
షా ఆరోపణలు రుజువు చేయాలని దీదీ సర్కార్​ సవాల్​

తృణమూల్​, భాజపా మధ్య మాటల యుద్దం తీవ్రమైంది. వలస కార్మికుల రైళ్లను రాష్ట్రంలోకి రాకుండా బంగాల్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిష్ షా చేసిన ఆరోపణలను ఖండించింది మమతా బెనర్జీ సర్కార్​. లాక్​డౌన్​ వంటి క్లిష్ట సమయంలో హోంమంత్రి విధులు సరిగ్గా నిర్వర్తించలేకపోయారని టీఎంసీ నేత, మమత మేనల్లుడు అభిశేక్ బెనర్జీ ధ్వజమెత్తారు. కొన్ని వారాల తర్వాత నోరు తెరిచిన షా, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ట్వీట్​ చేశారు. బంగాల్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.

మమతను చూసి ఓర్వేలేకే కేంద్రం ఆమెను లక్ష్యంగా చేసుకుని లేనిపోని ఆరోపణలు చేస్తోందని టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి 8 రైళ్లు కార్మికులతో బంగాల్​ చేరుకున్నాయని తెలిపారు. కేంద్రం అబద్ధాలు చెబుతోందని, సీఎం మమతా బెనర్జీని విమర్శించే హక్కు లేదన్నారు. మహారాష్ట్రలో 16 మంది వలస కార్మికుల మృతికి రైల్వే శాఖ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు 6000 మంది కార్మికులు బంగాల్ చేరుకున్నారని, పంజాబ్​, కేరళ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల నుంచి మరో 10రైళ్లలో ఇంకా వస్తారని దీదీ సర్కార్​ తెలిపింది.

భాజపా ఖండన..

బంగాల్​ ప్రభుత్వం తప్పుడు వివరాలు చెబుతోందని రాష్ట్ర భాజపా నేతలు ఎదురుదాడి చేశారు. ఇప్పటివరకు రెండు రైళ్లు మాత్రమే రాష్ట్రానికి చేరుకున్నాయని, ఒక వర్గానికి చెందిన కార్మికుల తరలింపుపైనే మమత సర్కార్ దృష్టి సారించిందని భాజపా జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. కొవిడ్​కు కేటాయించిన నిధులను కూడా టీఎంసీ ప్రచారం కోసం వినియోగిస్తోందని విమర్శించారు. రూ.1300 కోట్లను స్థానిక కబ్బులకు వెచ్చించగా, కొవిడ్​ కోసం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.

షా వ్యాఖ్యలతో మొదలు..

బంగాల్​కు చెందిన వలస కార్మికులకూ సొంత రాష్ట్రానికి చేరుకోవాలని ఉన్నా, మమత ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను అనుమతించడం లేదని షా ఆరోపించారు. కార్మికులను తరలించడం కేంద్రానికి సమస్యగా మారిందన్నారు.

Last Updated : May 10, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.