ETV Bharat / bharat

'మహా'లో ఆగని వైరస్​ ఉద్ధృతి.. మరో 5,493 కేసులు

author img

By

Published : Jun 28, 2020, 6:20 PM IST

Updated : Jun 28, 2020, 8:52 PM IST

Tamil Nadu reports 3,940 new #COVID19 positive cases and 54 deaths today
తమిళనాడులో ఒక్కరోజే 3,940 మందికి కరోనా

18:51 June 28

మహారాష్ట్రలో కరోనా వైరస్​ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. ఇవాళ మరో 5,493 మంది కొవిడ్​ బారినపడ్డారు. ఇప్పటివరకు నమోదైన ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం. మొత్తం కేసుల సంఖ్య లక్షా 64 వేలు దాటింది. మరో 156 మంది కొవిడ్​ మృతి చెందగా.. మరణాల సంఖ్య 7,429 పెరిగింది.

తమిళనాడులో 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,940 మందికి వైరస్​ సోకింది. మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 82 వేలు దాటింది. మరణాలు 11 వందలకు చేరువయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 32 వేల 948 నమూనాలు పరీక్షించారు.

దిల్లీలో వైరస్​ విజృంభణ

దిల్లీలో కొత్తగా 2,889 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో  మొత్తం వైరస్ కేసులు 83వేలు దాటాయి. మరణాల సంఖ్య 2,623కు చేరింది.

కేరళలో మరో 118 మంది వైరస్ బారినపడ్డారు.

ఇతర రాష్ట్రాల్లో వైరస్​ కేసులు ఇలా..

  • కర్ణాటకలో కొత్తగా 1,267మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరించారు. కేవలం బెంగళూరులోనే 783 కేసులు నమోదయ్యాయి. మరో 16మంది మృతి చెందారు. దీంతో కేసుల సంఖ్య 13,190 చేరగా... మరణాల సంఖ్య 207 పెరిగింది.
  • గుజరాత్​లో 624మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసులు 31,397 పెరిగాయి. మరణాలు 1,809కు చేరాయి.
  • బంగాల్​లో 572 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 17,283కు చేరింది. మరో 10మంది వైరస్​కు బలయ్యారు.
  • పంజాబ్​లో ఒక్కరోజులో కొత్తగా 161మందికి వైరస్​ సోకింది. మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,216కు చేరగా... మరణాల సంఖ్య 133కు పెరిగింది.
  • మణిపుర్​లో ఇప్పటివరకు కొవిడ్​ మరణాలు సంభవించనప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. 24గంటల వ్యవధిలో 93 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసులు 1,185కు చేరుకున్నాయి.
  • ఉత్తరాఖండ్​లో కొత్తగా 32మందికి వైరస్ సోకగా... మొత్తం కేసులు 2,823కు పెరిగాయి.

18:17 June 28

తమిళనాడులో ఒక్కరోజే 3,940 మందికి కరోనా

తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,940 మందికి వైరస్​ సోకింది. మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 82 వేలు దాటింది. మరణాలు 11 వందలకు చేరువయ్యాయి. 

ఇవాళ ఒక్కరోజే 32 వేల 948 నమూనాలు పరీక్షించారు. 

Last Updated : Jun 28, 2020, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.