ETV Bharat / bharat

'మహాభారతం' స్టైల్​లో భాజపాకు స్వామి అల్టిమేటం

author img

By

Published : Sep 9, 2020, 5:46 PM IST

Subramanian Swamy's ultimatum to Nadda: Sack Malviya by Thursday
'మహాభారతం' స్టైల్​లో భాజపాకు స్వామి అల్టిమేటం

ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. సొంత పార్టీ భాజపాకు అల్టిమేటం జారీ చేశారు. పార్టీ ఐటీ విభాగం ఇన్​ఛార్జ్​ అమిత్​ మాల్వియాను.. గురువారం నాటికి ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు. భాజపా ఐటీ విభాగం.. ట్విట్టర్​లో తనపై దాడి చేస్తోందని ఇటీవలే ఆరోపించారు స్వామి.

భాజపా ఐటీ విభాగానికి, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి మధ్య వివాదం ముదురుతోంది. ఐటీ విభాగం హద్దు మీరి తనపై దాడి చేస్తోందని ఇటీవలే ఆరోపించారు స్వామి. తాజాగా ఇదే విషయంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అల్టిమేటం జారీ చేశారు. గురువారంలోగా ఐటీ విభాగం ఇన్​ఛార్జ్​ అమిత్​ మాల్వియాను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంపై మహాభారతంలో శ్రీ కృష్ణుడు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ట్వీట్​ చేశారు.

"రేపటి కల్లా మాల్వియాను భాజపా ఐటీ సెల్​ నుంచి తొలగించాలి(ఇది నడ్డాకు.. నా ఐదు గ్రామాల రాజీ ప్రతిపాదన). ఒకవేళ అది జరగకపోతే.. పార్టీ నావైపు ఉండాలనుకోవడం లేదని అర్థం. ఆ సందర్భంలో.. నాకు నేనే మద్దతుగా నిలవాల్సి ఉంటుంది."

--- సుబ్రహ్మణ్య స్వామి, రాజ్యసభ ఎంపీ.

మహాభారతంలో.. పాండవుల పాలన కోసం ఐదు గ్రామాలను ఇవ్వాలని ధృతరాష్ట్రుడి వద్ద తుది ప్రతిపాదన చేస్తాడు కృష్ణుడు. అందుకు ధృతరాష్ట్రుడు అంగీకరించకపోవడం వల్ల.. యుద్ధం అనివార్యమని కృష్ణుడు స్పష్టం చేస్తాడు.

ట్విట్టర్​లో.. ఫేక్​ ఐడీలు సృష్టించుకొని తనపై భాజపా ఐటీ విభాగం దాడి చేస్తోందని సుబ్రహ్మణ్య స్వామి సోమవారం ఆరోపించారు. మాల్వియా వంటి వ్యక్తి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మర్యాద పురుషోత్తముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగే పార్టీ భాజపా అని.. రావణుడి అడుగు జాడాల్లో నడిచే పార్టీ కాదని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:- 4,442 మంది ప్రజా 'నేత'లపై క్రిమినల్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.