ETV Bharat / bharat

'రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లోనూ సీఈటీ స్కోరు'

author img

By

Published : Aug 23, 2020, 7:29 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనూ కేంద్రం నిర్వహించే ఉమ్మడి అర్హత పరీక్ష స్కోరును వినియోగించుకోవచ్చని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అభ్యర్థులకు సమయం, ఖర్చు వృథా తగ్గుతుందని స్పష్టం చేశారు.

Jitendra Singh
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) స్కోరును రాష్ట్రాలు కూడా వినియోగించుకోవచ్చని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఫలితంగా నియామక సంస్థలకు ఖర్చులు, సమయం వృథా తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

సీఈటీ స్కోరును రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు అందిస్తామని అధికారిక ప్రకటనలో తెలిపారు.

"అభ్యర్థుల ఎంపిక కోసం జాతీయ నియామక సంస్థ నిర్వహించే సీఈటీ ఫలితాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పొందవచ్చు. ఈ స్కోరు ద్వారా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సంబంధిత సంస్థలు నియమించుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్​ ఆమోదం తెలిపింది."

- జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి

కేంద్రం నిర్ణయానికి చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సుముఖత వ్యక్తం చేశాయని జితేంద్ర వెల్లడించారు. ఈ సంస్కరణలను అమలు చేసేందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తి కనబరిచారని తెలిపారు. ఇందుకోసం సీఈటీని తొలుత 12 భాషల్లో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. క్రమంగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్​లోని అన్ని భాషలకు విస్తరిస్తామని పేర్కొన్నారు.

కేబినెట్ నిర్ణయం..

కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల నియామక ప్రక్రియలో మోదీ సర్కారు బుధవారం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహణ కోసం నేషనల్​ రిక్రూట్​మెంట్​ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష- లాభాలు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.