ETV Bharat / bharat

హాకీలో దేశానికి 27 పతకాలు తెచ్చిపెట్టింది ఆ ఊరే

author img

By

Published : Jan 7, 2021, 7:48 AM IST

భారత్‌కు 14 మంది ఒలంపిక్ ఆటగాళ్లను అందించిన ఊరది. మనదేశానికి 27పతకాలు సాధించిపెట్టిన ఆటగాళ్లను పెంచిన గ్రామమది. హాకీ మక్కాగా పేరుపొందిన ఈ ఊరు.. క్రీడాకారులకు ప్రస్తుతం సరైన ఆట మైదానం అందించడంలో వెనబడుతోంది. భారత హాకీని ప్రపంచస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఈ ఊరి మైదానం కీలకపాత్ర పోషించింది. ఇంతకీ ఆ ఊరేది? దాని చరిత్ర ఏంటి? ఓ సారి తెలుసుకుందాం...

Special story about Indian Hockey mecca Sansarpur at Jalandharpur in Punjab
'హాకీ మక్కా సన్​సార్​పుర్'​లో.. ఆస్ట్రో టర్ఫ్​ రాక ఎప్పుడో?

హాకీ మక్కా సన్​సార్​పుర్ గ్రామం

పంజాబ్‌ జలంధర్‌లో ఉన్న సన్‌సార్‌పుర్ గ్రామం.. హాకీ మక్కాగా పేరుపొందింది. ఈ ఊరి చరిత్ర తెలుసుకుంటే గ్రామంపై గౌరవం పెరుగుతుందనడంలో సందేహమే లేదు. 14 మంది ఒలంపిక్ ఆటగాళ్లను దేశానికి అందించిన ఏకైక గ్రామం సన్‌సార్‌పుర్. ఒలింపిక్స్‌లో పాల్గొని, ఇప్పటివరకూ భారత్‌కు 27 పతకాలు సాధించిపెట్టిన ఆటగాళ్లను పెంచిన ఊరది.

"మా ఊరి వాళ్లు బ్రిటిషర్లతో కూడా ఆడేవారు. క్రమంగా ఆటపై ఆసక్తి పెరిగి, వారితో ఆడుతూనే మాలోని నైపుణ్యాలు పెంపొందించుకున్నాం. ఇదే మైదానం నుంచి ప్రారంభించి, భారత్‌కు 14 మంది ఒలంపియన్లను ఇచ్చింది సన్‌సార్‌పుర్."

- అర్విందర్ సింగ్, ఒలంపియాన్ గుర్వేద్ సింగ్ బంధువు

అధికారుల నిర్లక్ష్యంతో..

భారత హాకీని ప్రపంచస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఓ సమయంలో ఈ ఊరి మైదానం కీలకపాత్ర పోషించింది. కానీ.. అదిప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతోంది. ప్రపంచస్థాయిలో హాకీ ప్రాభవం చాటి చెప్పిన సన్‌సార్‌పుర్‌.. 'ఆస్ట్రో టర్ఫ్' మైదానం కోసం ఇంకా వేచిచూస్తోంది. హాకీని అభిమానించే ఆటగాళ్ల సాధనకు ఈ ఊరి మైదానమే కేంద్రం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు కల్పిస్తే.. సన్‌సార్‌పుర్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని క్రీడాకారులు చెప్తున్నారు.

ఇదీ చదవండి: ఎంత ఎత్తున్నా సులువుగా ఎక్కేస్తాడు 'కోతిరాజ్'​

"ఉన్నత ప్రమాణాలతో ఓ మంచి సమీకృత క్రీడా కేంద్రం నిర్మిస్తే బాగుంటుంది. ఈ ఊరిని ఆనుకుని ఉన్నది ఆర్మీ మైదానం. అక్కడ సాధన చేసిన పిల్లలు ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. ఆస్ట్రో టర్ఫ్ మైదానం వస్తే భవిష్యత్తులోనూ భారత్‌కు గొప్ప క్రీడాకారులను ఇవ్వగలదు మా గ్రామం."

- అర్విందర్ సింగ్, ఒలంపియాన్ గుర్వేద్ సింగ్ బంధువు

ప్రత్యేక శిక్షణ కోసం..

చరిత్రలో ఈ మైదానానికున్న ప్రత్యేకత దృష్టిలో ఉంచుకుని, పంజాబ్ ప్రభుత్వం ఔత్సాహికులకు శిక్షణనిచ్చేందుకు గానూ ఓ మహిళా శిక్షకురాలు సహా ఇద్దరు కోచ్‌లను నియమించింది. ఇతర సదుపాయాలూ కల్పిస్తోంది.

"పిల్లలు ఇక్కడికి వస్తున్నారంటే అందుకు ఈ మైదానం చరిత్రే కారణం. ఒకేసారి తమ ఊరి నుంచి భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉండడం వాళ్లకు గర్వకారణమే. క్రీడాకారులకు ఏ లోటూ లేకుండా అన్ని సదుపాయాలూ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలూ తీసుకుంటోంది. ఆటకు కావాల్సిన ఆస్ట్రో టర్ఫ్ లేకపోయినా.. ఉన్న చిన్న మైదానంలోనే పిల్లలంతా హాకీ సాధన చేస్తారు. ఇతర ఆటలు కూడా బాగా ఆడతారు."

- గుర్‌ప్రీత్ సింగ్, కోచ్

ప్రస్తుతం 60 నుంచి 70 మంది విద్యార్థులు దేశానికి పతకాలు తేవాలన్న లక్ష్యంతో ఈ మైదానంలో నిత్యం సాధన చేస్తున్నారు.

"మా కోచ్‌లు చాలా మంచివాళ్లు. మాకు కావల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తారు. మాకేదైనా అర్థం కాకపోతే.. సరైన, సులభమైన రీతిలో వివరిస్తారు."

- సిమ్రాన్, హాకీ క్రీడాకారిణి

"ఇక్కడి పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో హాకీ ఆడాలని కోరుకుంటున్నాను. కానీ.. ఇక్కడ చాలా చిన్న బృందం ఉంది. సాధన సరిగా చేయలేకపోతున్నాం. అందుకే మాకు పెద్ద మైదానం సహా మరికొన్ని సదుపాయాలు కల్పిస్తే ప్రతిభ చాటుతాం."

- తను, హాకీ క్రీడాకారిణి

గర్వంగా చెప్పుకుంటూ..

గ్రామంలో పెద్ద మైదానం లేకపోయినా.. ఆస్ట్రో టర్ఫ్‌ ఏర్పాటు చేసే అవకాశముంది. చరిత్రలో ప్రత్యేకస్థానం సంపాదించుకున్న ఈ మైదానంలో ఉత్సాహంగా హాకీ నేర్చుకుంటూ, ఆడుకోవడం గర్వకారణమని చెబుతున్నారు గ్రామస్థుల పిల్లలు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ జిమ్​-​ పరికరాలన్నీ 'మేడ్​ ఇన్​ లోకల్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.