ETV Bharat / bharat

పొగమంచు వల్ల ప్రమాదం- ఆరుగురు మృతి

author img

By

Published : Dec 7, 2020, 3:15 PM IST

రాజస్థాన్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. పొగమంచు రహదారిని కమ్మేయడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

truck-and-jeep-collision-in-churu
పొగమంచు వల్ల ప్రమాదం- ఆరుగురు మృతి

రాజస్థాన్​ చురులోని సర్దార్​షహర్ గ్రామంలో పొగమంచు కారణంగా రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు అధికమవుతున్నాయి. గత రెండు రోజులుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతుండగా... తాజాగా ట్రక్కు, జీపు ఒకదానినొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు మరణించారు.

truck-and-jeep-collision-in-churu
రహదారిపై ఏర్పడిన పొగమంచు

జీపులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారని సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీరు రావత్సార్ నుంచి దుంగర్​గఢ్​కు వెళ్తుండగా.. టమాటాలతో నిండి ఉన్న లారీ ఢీకొట్టిందని చెప్పారు.

ప్రమాదంలో గాయపడినవారిని సర్దార్​షహర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

truck-and-jeep-collision-in-churu
చికిత్స పొందుతున్న బాధితుడు
truck-and-jeep-collision-in-churu
ఆస్పత్రిలో క్షతగాత్రులు

గత రెండు రోజులుగా ఈ రహదారిపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ ప్రమాదంలో ఐదు వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టగా.. మరో ఘటనలో నాలుగు వాహనాలు ఢీకొట్టాయి. అయితే ఈ రెండు ప్రమాదాల్లో ఎవరికీ గాయాలు కాలేదు. భనిపురా గ్రామానికి సమీపంలోనే ఈ ప్రమాదాలు జరగడం గమనార్హం.

truck-and-jeep-collision-in-churu
రోడ్డును కమ్మేసిన పొగమంచు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.