ETV Bharat / bharat

క్లినికల్​ ట్రయల్స్​ మందుల్లో 'రెమిడెసివిర్' భేష్​!

author img

By

Published : May 24, 2020, 5:00 AM IST

కొవిడ్​-19 కోసం ప్రస్తుతం పలు ఔషధాలను క్లినికల్​ ట్రయల్స్​లో ప్రయోగిస్తున్నారు. అందులో రెమిడెసివిర్​ అద్భుతంగా పనిచేస్తూ.. మంచి ఫలితాలు రాబడుతున్నట్లు పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. కరోనాకు వ్యాక్సిన్​ వచ్చేందుకు 5-10 ఏళ్లు పడుతుందని, ఇతర వ్యాధుల ఔషధాలను ఉపయోగించి టీకా తయారు చేయటం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. అయితే కరోనాపై ప్రభావం చూపుతున్న మందులను గుర్తించేందుకు క్లినికల్​ ట్రయల్స్​ చేయాలని స్పష్టం చేశారు.

Several drugs under trial for COVID-19,
క్లినికల్​ ట్రయల్స్​లోని డ్రగ్స్​లో 'రెమిడెసివిర్' భేష్​!

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. అందుకే ఇతర వ్యాధులకు వినియోగించిన పాత ఔషధాల సాయంతో ట్రయల్స్​ చేస్తున్నామని తెలిపారు. ఆ ప్రయత్నాలు కొవిడ్​ను నిరోధించే ఆశను పెంచుతున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో యాంటివైరల్​ డ్రగ్​ రెమిడెసివిర్​ ముందంజలో ఉన్నట్లు చెప్పారు.

ప్రస్తుతం పలు రకాల ఔషధాలు క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్నాయని, అందులో కరోనా రోగులు వేగంగా కోలుకునేందుకు రెమిడెసివిర్​ ఉపయోగపడుతోందని పేర్కొన్నారు నిపుణులు.

కొవిడ్​-19 చికిత్స కోసం 130కిపైగా ఔషధాలు పరిశోధన దశలో ఉన్నాయి. అందులో కొన్ని వైరస్​ వృద్ధిని అడ్డుకోగా, మరికొన్ని రోగనిరోధక శక్తి అతి స్పందనను నిరోధిస్తున్నాయని అమెరికాకు చెందిన మిల్కెన్​​ ఇన్​స్టిట్యూట్​ పేర్కొంది.

" ప్రస్తుతం ఒకే ఒక ప్రభావవంతమైన విధానం ఉంది. ఇతర వ్యాధుల ఔషధాలను కొవిడ్​-19కు ఉపయోగిస్తూ.. వాటితో మెరుగైన ఫలితాలు సాధిచడం ఒక్కటే ముందున్న మార్గం. ఉదాహరణకు రెమిడెసివిర్​. ఆ డ్రగ్​ కరోనా రోగులు త్వరగా కోలుకునేందుకు సాయపడుతోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన వారిలోనూ మరణాల రేటును తగ్గిస్తోంది. కొత్త డ్రగ్​ అభివృద్ధి చేసేందుకు సమయం లేదు. అందుకోసం 5-10 ఏళ్లు పడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న వాటినే వినియోగించాలి. ప్రస్తుతం ఉన్న మందుల్లో ఏవి ప్రభావవంతగా ఉన్నాయో తెలుసుకునేందుకు క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించాలి. అలాంటి వాటిని గుర్తిస్తే.. డ్రగ్​ కంట్రోల్​ విభాగం నుంచి అనుమతులు తీసుకోవచ్చు."

– రామ్​ విశ్వకర్మ, డైరెక్టర్​ (ఐఐఐఎం - సీఎస్​ఐఆర్​, జమ్ము)

కరోనా వైరస్​పై రెమిడెసివిర్​ డ్రగ్​ క్లినికల్​ ట్రయల్స్​కు గిలీడ్​ సైన్సెస్​ అడిగిన వెంటనే.. అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్​డీఏ) అనుమతులు ఇచ్చినట్లు గుర్తు చేశారు రామ్​. రెమిడెసివిర్​తో పాటు ఫవిపిరవిర్​ కూడా ముందంజలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ డ్రగ్​ క్లినికల్​ ట్రయల్స్​కు జపాన్​లో అనుమతి ఇచ్చారు.

భారత్​ కీలక పాత్ర…

ఫవిపిరవిర్​ తయారీ కోసం హైదరాబాద్​లోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ టెక్నాలజీ (ఐఐసీటీ) కూడా సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు.. సీఎస్​ఐఆర్​ డైరెక్టర్​ జనరల్​ శేఖర్​ ముండే ఇటీవల ప్రకటించారు. ఫవిపిరవిర్​, రెమిడెసివిర్​, యాంటీ ఇన్ల్ఫమేటరీ డ్రగ్​ కొల్చిసిన్​లపై సీఎస్​ఐఆర్​ క్లినికల్​ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.