ETV Bharat / bharat

రామాలయ నిర్మాణానికి శివసేన రూ.కోటి విరాళం

author img

By

Published : Dec 18, 2020, 5:58 PM IST

Sena has given Rs 1 Cr, Adityanath Rs 11 lakh for Ram temple's construction: Temple trust official
రామాలయ నిర్మాణానికి శివసేన రూ.కోటి విరాళం

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం విరాళాల సేకరణ ప్రారంభమైంది. శివసేన పార్టీ రూ.1కోటి నిధులు సమకూర్చగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ రూ.11లక్షలు ఇచ్చారని ఆలయ ట్రస్ట్​ వెల్లడించింది.

అయోధ్యలో చారిత్రక రామ మందిర నిర్మాణం కోసం భారీఎత్తున విరాళాలు పోగవుతున్నాయి. శివసేన పార్టీ తరఫున రూ.1కోటి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ రూ. 11లక్షలు నిధులిచ్చినట్టు రామ్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్ శుక్రవారం తెలిపారు.

ఆలయం కోసం విరాళాలు సేకరించేందుకు.. 2020 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు 'శ్రీరామ్​ మందిర్​ నిధి సమర్పణ్​'ను చేపడతామని రాయ్​ తెలిపారు. రామ జన్మభూమిలో నిర్మించే ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా.. ప్రతి భక్తుడూ తన వంతు సాయమందించాలని ఆయన కోరారు. దీని కోసం విశ్వహిందూ పరిషత్​(వీహెచ్​పీ) కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరిస్తారని స్పష్టం చేశారు రాయ్​.

విదేశీయుల ద్వారా నిధులను సమకూర్చేందుకు కేంద్రం నుంచి తమకు అనుమతి లేనందున కేవలం దేశీయ విరాళాలనే ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తామని ఇటీవలే చెప్పారు రాయ్​. అయితే.. ఈ విరాళాల సేకరణలో ఎలాంటి నిర్దేశిత లక్ష్యం లేదని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జనవరి 26న అయోధ్య మసీదుకు పునాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.