ETV Bharat / bharat

వివక్షకు తావులేకుండా దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ: షా

author img

By

Published : Nov 20, 2019, 6:23 PM IST

Updated : Nov 20, 2019, 7:42 PM IST

జాతీయ పౌర జాబితాను దేశవ్యాప్తంగా చేపట్టే విషయంపై స్పష్టత ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అసోం సహా అన్ని రాష్ట్రాల్లో ఎన్​ఆర్​సీని చేపడతామని రాజ్యసభ వేదికగా ప్రకటించారు. ఈ ప్రక్రియలో మతపరమైన వివక్ష ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్​ఆర్​సీకి, పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

వివక్షకు తావులేకుండా దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ: షా

వివక్షకు తావులేకుండా దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ: షా

దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ) చేపడతామని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఎన్​ఆర్​సీ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో మతపరంగా ఎలాంటి వివక్ష ఉండబోదని స్పష్టం చేశారు.

రాజ్యసభలో ఎన్​ఆర్​సీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు షా. పౌర జాబితా, పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు మధ్య సంబంధం లేదని స్పష్టం చేశారు.

"సుప్రీం కోర్టు ఆదేశాలతో అసోం రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ చేపట్టాం. దేశవ్యాప్తంగా పౌర జాబితాను చేపట్టే ప్రక్రియలో అసోం కూడా భాగమవుతుంది. ఇందులోని విషయంపై మరోమారు స్పష్టత ఇస్తున్నాను. ఏ మతానికి చెందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలందరినీ ఎన్​ఆర్​సీ కిందకు తీసుకురావాలని ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన్​ శరణార్థులు భారతీయ సంస్కృతిలో కలవాలని కోరుకుంటున్న వారి కోసం పౌరసత్వ చట్ట సవరణ బిల్లు తీసుకొస్తున్నాం. మతపరమైన దురాగతాలతో బంగ్లాదేశ్​, పాకిస్థాన్​, ఆఫ్గానిస్థాన్​ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు ఈ చట్టం ద్వారా పౌరసత్వం కల్పిస్తాం."
- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

ఇతర మతాలకు చెందిన వారు పౌర జాబితాలో ఉండకూడదని ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు హోంమంత్రి. అన్ని మతాలకు చెందిన భారతీయ పౌరులందరూ ఎన్​ఆర్​సీలోకి వస్తారని తెలిపారు.

ట్రైబ్యునల్​ను ఆశ్రయించవచ్చు..

అసోం ఎన్​ఆర్​సీలో చోటు లభించని వారికి ట్రైబ్యునల్​ను ఆశ్రయించే హక్కు ఉందన్నారు షా. రాష్ట్రవ్యాప్తంగా ట్రైబ్యునల్స్​ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాటికి అయ్యే ఖర్చును భరించలేని వారి కోసం ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేస్తుదన్నారు.

మరోమారు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు..

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు 16వ లోక్​సభలో ఆమోదం లభించింది. అనంతరం సెలెక్ట్​ కమిటీ ఆమోదించింది. కానీ.. లోక్​సభ రద్దు అయిన కారణంగా మరోమారు ఈ బిల్లును తీసుకురావాలని చూస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు స్పష్టతనిచ్చారు షా.

ఇదీ చూడండి: వాట్సాప్​ను వెంటనే అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే అంతే!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Nov 20, 2019 (CCTV - No access Chinese mainland)
1. Screenshot of statement on website of China's Ministry of Foreign Affairs
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
2. Chinese Ministry of Foreign Affairs building
3. Chinese national emblem
4. Sign of Chinese Ministry of Foreign Affairs
FILE: Washington D.C., USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Various of U.S. Capitol building, U.S. national flag
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of Tian'anmen Rostrum, Chinese national flag
FILE: Hong Kong, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
7. Various of cityscape
FILE: Hong Kong, China - Aug 8, 2019 (CCTV - No access Chinese mainland)
8. Victoria Harbor
FILE: Hong Kong, China - Aug 8, 2019 (CCTV - No access Chinese mainland)
9. Various of Golden Bauhinia Square, Chinese national flag, Hong Kong Special Administrative Region flag
FILE: Hong Kong, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
10. Various of traffic, pedestrians
Chinese Vice-Foreign Minister Ma Zhaoxu on Wednesday summoned William Klein, charge d'affaires of the U.S. Embassy in China, to lodge stern representations and strong protest against U.S. Senate for passing the so-called Hong Kong Human Rights and Democracy Act on Tuesday.
The Vice-Foreign Minister said: "Hong Kong is China's Hong Kong and the Hong Kong's affairs are China's internal affairs, brooking no interference by any foreign government and force."
Ma said:"The act passed by the U.S. Senate is a blatant interference in the Hong Kong affairs and China's internal affairs. Such move has seriously violated the international law and the basic norms governing international relations. China firmly opposes it."
He urged the United States to immediately take effective measures to prevent this act from being signed into law, immediately stop interfering in the Hong Kong affairs and China's internal affairs. Otherwise, China will have to take strong countermeasures and the United States must face all the consequences.
Ma said: "The Chinese government is unshakable in its determination to safeguard national sovereignty, security and development interests, to implement the 'one country, two systems' principle, and to oppose external forces in interfering in Hong Kong's affairs," adding that any attempt to undermine the prosperity and stability of Hong Kong and to hinder China's development will end in failure and ultimately lift the rock only to drop on its own feet.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated :Nov 20, 2019, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.