ETV Bharat / bharat

ఆ ఎమ్మెల్యే హత్య కేసులో 33మంది మావోలపై ఛార్జ్​షీట్

author img

By

Published : Oct 2, 2020, 2:59 PM IST

nia-charge-sheet-against-33-maoists-in-chhattisgarh-mlas-murder-case
ఆ ఎమ్మెల్యే హత్య కేసులో 33 మంది మావోలపై చార్జ్ షీట్!

ఛత్తీస్​గఢ్ భాజపా ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో 33మంది మావోలపై ఛార్జ్​షీట్ దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). అందులో ఆరుగురిని అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.

ఛత్తీస్​గఢ్ భాజపా ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో నిందితులైన 33మంది మావోలపై ఛార్జ్​షీట్ దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ).

2019 ఏప్రిల్ 9న దంతేవాడ జిల్లాలోని శ్యాంగిరి గ్రామ సమీపంలో.. ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే భీమా మాండవిని పక్కా సమాచారంతో హతమార్చారు నక్సలైట్లు. దాదాపు నెల రోజులుగా ప్రణాళిక వేసి నకుల్నర్ బాచేలీ రోడ్డు మీద ఐఈడీ బాంబును ఏర్పాటు చేశారు. అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్​ను పేల్చి భీమా సహా మరో నలుగురు జవాన్ల ప్రాణాలు తీశారు. రక్షక బలగాల వద్దనున్న ఆయుధాలను లూఠీ చేశారు మావోలు.

భీమా మాండవి హత్య కేసును ఈ ఏడాది మార్చి నెలలో స్వీకరించింది ఎన్ఐఏ. జగదల్పుర్ ఎన్ఐఏ కోర్టులో.. 33 మంది మావోలపై ఛార్జ్​షీట్ నమోదు చేసి.. మావోలకు ఆశ్రయమిచ్చి విద్యుత్ తీగలు, ఆహారం ఇతర వసతులు కల్పించిన ఆరుగురిని అరెస్ట్ చేసింది. ఆ ఆరుగురు దంతేవాడకు చెందిన మడ్కా రామ్ తాతీ, భీమా రాం తాతీ, లింగే తాతీ, లక్షణ్ జైస్వాల్, రమేశ్ కుమార్ కశ్యప్, హరిపల్ సింగ్ చౌహాన్లేనని వెల్లడించింది. 33 మందిలో ఐదుగురు ఇప్పటికే మృతి చెందగా మరో 22 మంది పరారీలో ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: టన్నెల్​ ప్రారంభానికి ముందు అక్కడి సిబ్బందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.