ETV Bharat / bharat

కరోనా బాధితులపై 'బాలాడోల్' ట్రయల్స్​కు అనుమతి

author img

By

Published : Sep 11, 2020, 10:54 PM IST

పీఎన్​బీ వెస్పర్​ లైఫ్​ సైన్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ తయారు చేసిన ఔషదాన్ని కరోనా బాధితులపై క్లినికల్​ ట్రయల్స్​కు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్ ఆఫ్​ ఇండియా అనుమతినిచ్చింది. ఈ ట్రయల్స్ కనుక విజయవంతమైతే ప్రపంచంలో మహమ్మారికి ఔషధాన్ని అందించిన తొలి సంస్థగా నిలవనునుంది పీఎన్​బీ వెస్పర్​.

New Covid-19 drug gets DCGI's nod for human trial
కరోనా బాధితులపై ట్రయల్స్​కు 'బాలాడోల్'​కు అనుమతి

కరోనా ఔషధాన్ని మనుషులపై పరీక్షించేందుకు పీఎన్​బీ వెస్పర్​ లైఫ్​ సైన్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​కు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్ ఆఫ్​ ఇండియా​ నుంచి శుక్రవారం అనుమతి లభించింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో మానవాళికి ఇది ఎంతో కీలకమైన ఘట్టంగా అభివర్ణించారు పీఎన్​బీ వెస్పర్​ సంస్థ సీఈఓ బలరాం. ఈ డ్రగ్​​ కనుక విజయవంతమైతే కరోనాకు ఔషదాన్ని అందించిన తొలి సంస్థగా నిలవనుంది పీఎన్​బీ వెస్ఫర్​

పీఎన్​బీ సంస్థ తయారు చేసిన ఈ ఔషధం మొదటి దశలో​ మంచి ఫలితాలనిచ్చిందని .. రెండో దశలో పూణెలోని బీఎంజే మెడికల్​ కాలేజీలో వెంటిలేటర్ల మీద ఉన్న 40 మంది రోగులపై క్లినికల్ చేయనునన్నట్లు తెలిపింది. వీరిని మొత్తం 60 రోజుల పాటు పర్యవేక్షించనుంది.

"ఎక్కువ మంది బాధితులు జ్వరం, ఒళ్లు నొప్పులు, ఊపిరితిత్తుల్లో మంట, కైటోకైన్​ స్టోర్స్​, ఏఆర్​డీఎస్​ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. మా ఔషధం​ జ్వరాన్ని, ఒంటి నొప్పులు, ఊపిరితిత్తుల్లో మంటను తగ్గిస్తుందని క్లినికల్​ ట్రయల్స్​ ద్వారా నిరూపించాం. ముఖ్యంగా శ్వాస ఇబ్బందులను తగ్గిస్తుంది. "

బలరాం, సీఈఓ

ఈ డ్రగ్​ మరణాల రేటును కూడా 80 శాతం తగ్గించగలదని బలరాం అన్నారు. కొవిడ్​ నియంత్రణకు వాడుతున్న వాటిలో ప్రపంచంలోనే ఎక్కువ గుర్తింపు పొందిన డెక్సామెథాసోన్ కూడా కేవలం 20 శాతం మరణాలనే ఆపుతుందని తెలిపారు. డెక్సామెథాసోన్‌తో పోలిస్తే బాలడోల్ క్లినికల్ ట్రయల్స్‌లో చాలా మంచి ఫలితం ఇవ్వగలదని ఆశిస్తున్నాం.

ప్రీ-క్లినికల్ ట్రయల్స్​లో స్టెరాయిడ్స్‌తో పోలిస్తే ఊపిరితిత్తుల్లో వచ్చే మంటను తగ్గించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తైన తర్వాత మూడో దశ కోసం 6 మెడికల్​ కాలేజీల్లోని 350 మందిపై ప్రయోగించనున్నారు. ఇప్పటికే ఈ ఔషధంపై అమెరికా, యూరప్​లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మేధో సంపత్తి హక్కుల ప్రకారం పేటెంట్​ను తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

అగ్రదేశాలతో చర్చ..

ఈ ఔషధాన్ని అమెరికా ఎఫ్​డీఏ ఆసక్తిని కనబరుస్తుందని చివరి దశకు చెందిన క్లినికల్​ ట్రయల్స్​పై చర్చలు కూడా జరిగినట్లు పేర్కొంది సంస్థ. మరో వైపు యూకే ప్రభుత్వంతో కూడా చర్చించినట్లు తెలిపింది. యూకేలో ట్రయల్స్​ను ఎరిక్​ లాట్​మాన్​ నేతృత్వంలోని పీఎన్​బీ వెస్ఫర్​కు చెందిన కెనడా పరిశోధకుల బృందం సమన్వయం చేస్తోంది. జ్వరాన్ని, నొప్పులను తగ్గించటంలో ఆస్పరిన్​ కంటే పీఎన్​బీ-001 20 రెట్లు ఎక్కువ ప్రభావం చూపినట్లు తెలిందని లాట్​మాన్​ వెల్లడించారు. అలాగే ప్లీహం, కైటోకిన్లను తగ్గించటంలో దోహదపడుతుందని రుజువైనట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.