ETV Bharat / bharat

200అడుగుల లోతులో బాలుడు- మృత్యువుతో పోరాటం

author img

By

Published : Nov 4, 2020, 4:44 PM IST

మధ్యప్రదేశ్​ నివాడి జిల్లాలో ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

MP: Five year old falls in borewell, rescue operation on
200అడుగుల లోతులో మృత్యువుతో పోరాటం

200అడుగుల లోతులో మృత్యువుతో పోరాటం

మధ్యప్రదేశ్​ నివాడి జిల్లా భారాబుజర్గ్ గ్రామంలో ఐదేళ్ల బాలుడు బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. భారాబుజర్గ్​కు చెందిన హరికృష్ణ కుష్వాహా కుమారుడు ప్రహ్లాద్ 200అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయినట్లు పృథ్వీపుర్​ ఎస్​ఐ నరేంద్ర త్రిపతి వెల్లడించారు. సుమారు వంద అడుగుల లోతు మేర నీరు ఉందని తెలిపారు. బాలుడు ఎంత లోతులో చిక్కుకున్నాడనేది తెలియాల్సి ఉందన్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

MP: Five year old falls in borewell, rescue operation on
కొనసాగుతున్న సహాయక చర్యలు
Five year old falls in borewell, rescue operation on
బాలుడు పడిపోయిన బోరుబావి ఇదే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.