ETV Bharat / bharat

వృద్ధుడి కృతజ్ఞతా ఉత్తరానికి ప్రధాని స్పందన

author img

By

Published : Aug 18, 2019, 6:07 AM IST

Updated : Sep 27, 2019, 8:47 AM IST

మధ్యప్రదేశ్​కు చెందిన 54 ఏళ్ల వృద్ధుడు రాసిన కృతజ్ఞతా ఉత్తరానికి ప్రధాని మోదీ స్పందించారు. ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందినందుకు ఆయనను మోదీ అభినందించారు.

వృద్ధుడి కృతజ్ఞతా ఉత్తరానికి ప్రధాని స్పందన

మధ్యప్రదేశ్​ ధార్​జిల్లా కుక్షి పట్టణానికి చెందిన మహిమారామ్​ పాటీదార్​(54) అనే వృద్ధుడు.. మూడు నెలల క్రితం హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే చికిత్సకు అయిన ఖర్చు మొత్తాన్ని 'ఆయుష్మాన్ భారత్​ పథకం' ద్వారా ప్రభుత్వమే భరించింది.

చేతి గడియారాలను మరమ్మతు చేసుకునే తనకు అనారోగ్యం సమయంలో మోదీ సర్కార్​ ఎంతో దన్నుగా నిలిచిందని భావించిన పాటీదార్​.. ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశాడు. అసలు ఈ ఉత్తరం మోదీ వరకు చేరుతుందో లేదో అని అనుకున్నాడు. కానీ... అనూహ్యంగా మహిమారామ్​కు ప్రత్యుత్తరం వచ్చింది. ఆయుష్మాన్​ భారత్ పథకంలో భాగమైనందుకు అభినందిస్తూ స్వయంగా ప్రధానే ఆ లేఖను పంపారు. ఈ స్పందనతో మహిమారామ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్​.

ఇదీ చూడండి : 11 సెకన్లలో 100మీ పరుగు-క్రీడామంత్రి ఫిదా

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.