ETV Bharat / bharat

'పునరుత్పాదకంలో పెట్టుబడులకు అపార అవకాశాలు'

author img

By

Published : Jul 15, 2020, 5:23 PM IST

భారత్​, ఐరోపా సమాఖ్య మధ్య జరుగుతున్న 15వ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం భారత్, ఐరోపా సమాఖ్య మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భారత్​లో పునరుత్పాదక ఇంధన వనరుల్లో పెట్టుబడులు పెట్టాలని ఈయూ వ్యాపార దిగ్గజాలను కోరారు.

MODI LIVE AT INDIA-EU SUMMIT
'ప్రపంచశాంతి కోసం భారత్​-ఈయూ భాగస్వామ్యం అనివార్యం'

భారత్​, ఐరోపా సమాఖ్య సహజ భాగస్వాములని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 15వ భారత్-ఈయూ సదస్సులో పాల్గొన్న మోదీ... ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఇరువురి మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యమని అన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఈ భాగస్వామ్యం అవసరం మరింత అర్థమైందని వ్యాఖ్యానించారు.

పెట్టుబడులతో రండి

ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు వాతావరణ మార్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా భారత్, ఈయూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నాయని పేర్కొన్నారు మోదీ. భారత్​లో పునరుత్పాదక ఇంధన వనరులను పెంచడం కోసం పెట్టుబడులు, సాంకేతికతతో ఐరోపా ముందుకురావాలని పిలుపునిచ్చారు.

కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన సమావేశాలు వాయిదా పడ్డప్పటికీ.. వర్చువల్​గా కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు మోదీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.