ETV Bharat / bharat

ఆ విమానాశ్రయాలపై తనిఖీలకు డీజీసీఏ సన్నద్ధం!

author img

By

Published : Aug 11, 2020, 8:48 PM IST

కేరళ కోజికోడ్​ ఘటన అనంతరం.. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలపై తనిఖీలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అధిక వర్షాలు కురిసే విమానాశ్రయాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ తెలిపింది.

Kozhikode plane crash: DGCA to audit airports that witness heavy rains
కోజికోడ్​ ఎఫెక్ట్​: ఆ విమానాశ్రయాలపై డీజీసీఏ తనిఖీలు

కోజికోడ్​ విమాన ప్రమాద ఘటనతో కేంద్ర విమానయాన యంత్రాంగం డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్(డీజీసీఏ) అప్రమత్తమైంది. అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏటా భారీ వర్షాలతో సతమతమవుతున్న ముంబయి, చెన్నై వంటి విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు డీజీసీఏ సీనియర్​ అధికారి ఒకరు వెల్లడించారు.

ఏఏఐ కింద 100కు పైగా..

పౌర విమానయాన శాఖ కింద పనిచేసే ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ).. దేశవ్యాప్తంగా మొత్తం 100కుపైగా విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ఇందులో కోజికోడ్​ ఎయిర్​పోర్ట్​ ఒకటి. అయితే.. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్​ వంటి ప్రధాన విమానాశ్రయాలు మాత్రం ప్రైవేటు కంపెనీల అధ్వర్యంలో నడుస్తున్నాయి.

'ఈఎంఏఎస్ టెక్నాలజీ లేకనే..'

కోజికోడ్​లోని టేబుల్​టాప్​ రన్​వేలో.. భద్రత కల్పించేందుకు ఇంజనీర్​డ్​ మెటీరియల్​ అర్రెస్టర్​ సిస్టమ్​(ఈఎంఏఎస్​) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రమాదం అనంతరం కాంగ్రెస్​ ఎంపీ మాణిక్కమ్​ ఠాగూర్​ తెలిపారు. ఈ విషయాన్ని ఏఏఐ, డీజీసీఏలు విస్మరించాయని ఆయన ఆరోపించారు.

ఈఎంఏఎస్​ ద్వారా విమానాశ్రయం చుట్టూ ప్రత్యేక సామాగ్రితో కట్టుదిట్టమైన భద్రతను అమరుస్తారు. ఫలితంగా ఫ్లైట్​ ల్యాండింగ్​కు రన్​వే అనుగుణంగా ఉంటుంది.

అయితే.. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా కోజికోడ్​ విమానాశ్రయంలో రన్​వే ఎండ్​ సేఫ్​టీ ఏరియా(ఆర్​ఈఎస్​ఏ) అమర్చామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్​దీప్​సింగ్ పూరీ పేర్కొన్నారు. ఐసీఏఓ ప్రకారం.. సివిల్​ ఎయిర్​పోర్ట్​లో ఈఎంఏఎస్​ తప్పనిసరికాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్​ఈఎస్​ అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈఎంఏఎస్​ అవసరమవుతుందని తెలిపారు.

ఇదీ చదవండి: 'కోజికోడ్​ విమానాశ్రయ రన్​వే సురక్షితమైనదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.