ETV Bharat / bharat

కేరళపై కరోనా పంజా- మరో 6వేల మందికి వైరస్​

author img

By

Published : Dec 16, 2020, 10:06 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గముఖం పట్టినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో మాత్రం కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేరళలో ఒక్కరోజులోనే 6వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 6.83 లక్షలు దాటింది.

KERALA REPORTS 6,185 NEW COVID-19 POSITVE CASES TODAY
కేరళపై కరోనా పంజా- మరో 6వేల మందికి వైరస్​

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఇటీవల తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. అయితే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం వైరస్​ వ్యాప్తి కొనసాగుతోంది. కేరళలో బుధవారం ఒక్కరోజే 6,185 మందికి కరోనా పాజిటివ్​గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 6.83 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. వారిలో సుమారు 2,700 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 1,547 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 12వేలకు సమీపించింది. దిల్లీలో ఇప్పటివరకు 10,147 మందిని కొవిడ్​ బలితీసుకుంది.
  • తమిళనాట మరో 1,181 కరోనా కేసులు వెలుగు చూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 8లక్షల 2వేలు దాటింది. వైరస్​తో మరో 12 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 11,391కి చేరింది.
  • కర్ణాటకలో కొత్తగా 1,240 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 9లక్షల 4వేల 665కు పెరిగింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 11,971 కరోనా మరణాలు సంభవించాయి.
  • ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజులోనే 1,227 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య 5.69 లక్షలకు చేరింది. వైరస్​తో పోరాడుతూ కొత్తగా 15 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 8,118కి ఎగబాకింది.
  • గుజరాత్​లో మరో 1,160 మంది కరోనా బారినపడ్డారు. కేసుల సంఖ్య 2.31లక్షలకు ఎగబాకింది. వైరస్​ ధాటికి ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 4,203 మంది చనిపోయారు.

ఇవీ చదవండి:

రేప్​ కేసుల్లో సాక్ష్యాల సేకరణకు కొత్త విధానం

కోరినంత మందు పోయలేదని వరుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.