ETV Bharat / bharat

కర్ణాటక, కేరళలో ఆగని కొవిడ్​ విధ్వంసం

author img

By

Published : Oct 4, 2020, 7:46 PM IST

దేశంలో కొవిడ్​ విలయం కొనసాగుతోంది. స్థిరంగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కన్నడనాట కొత్తగా 10,145 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. కేరళలో ఒక్కరోజులో 8,553 కరోనా కేసులు బయటపడ్డాయి. వైరస్​ వ్యాప్తి కారణంగా దిల్లీలో ఈ నెల 31వరకు పాఠశాలలు తెరిచే అవకాశం లేదని కేజ్రీవాల్​ సర్కార్​ తెలిపింది.

Karnataka reports 10,145 new COVID-19 cases and 67 deaths today
కర్ణాటక, కేరళలో కొనసాగుతున్న కొవిడ్​ విధ్వంసం

దేశంలో కరోనా అంతకంతకూ వ్యాపిస్తూనే ఉంది. కర్ణాటకలో ఆదివారం ఒక్కరోజే 10,145 మంది వైరస్​ బారినపడ్డారు. కేసుల సంఖ్య 6,40,661కు పెరిగింది. కొత్తగా 67 మంది మృతితో.. మొత్తం మరణాల సంఖ్య 9,286కు చేరింది.

  • కేరళలో కొత్తగా 8,553 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. ఫలితంగా బాధితుల సంఖ్య 2,28,886కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 836 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మరో 5,489 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 6,19,996కు ఎగబాకింది. కొత్తగా 66 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 9,784కు చేరింది.
  • రాజస్థాన్​లో ఒక్కరోజే 2,184 మంది వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా కేసుల సంఖ్య 1,44,030కు ఎగబాకింది. ఇప్పటివరకు అక్కడ 1,545 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొత్తగా 2,683 మందికి కరోనా సోకింది. దీంతో బాధితుల సంఖ్య 2,90,613కు పెరిగింది. ఇప్పటివరకు అక్కడ 5,510 మంది వైరస్​ కారణంగా మృతి చెందారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నెలాఖరు వరకు పాఠశాలల మూసివేత కొనసాగుతుందని కేజ్రీవాల్​ ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి: 'భారత్​లో 2021 జులైకి 25 కోట్ల మందికి వ్యాక్సిన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.