ETV Bharat / bharat

సెప్టెంబర్​ 5 నుంచి జియో గిగాఫైబర్​ సేవలు

author img

By

Published : Aug 12, 2019, 12:34 PM IST

Updated : Sep 26, 2019, 5:54 PM IST

జియో ఫైబర్

ఇంటర్నెట్​ రంగంలో మరో సంచలనానికి తెరతీసింది రిలయన్స్​ సంస్థ. అత్యంత తక్కువ ధరల్లో అంతర్జాల ఆధారిత సేవలన్నీ సంయుక్తంగా అందించేందుకు సిద్ధమైంది.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జియో గిగా ఫైబర్​ సెప్టెంబర్​ 5న ప్రారంభం అవుతుందని రిలయన్స్​ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం వేదికగా ఈ విషయం వెల్లడించారు.

మూడేళ్ల క్రితం సెప్టెంబర్​ 5న రిలయన్స్​ జియో ప్రారంభమై సంచలనాలు సృష్టించింది.

గిగా ఫైబర్​ ధరలు ఇలా..

వేగం.. 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్​ ధర.. రూ.700 నుంచి రూ.10,000

జియో ఫైబర్ డెమో

సేవలు

⦁ జియో గిగా ఫైబర్‌, సెట్‌టాప్‌బాక్సు ద్వారా వీడియో కాల్‌సేవలు
⦁ ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా కాన్ఫరెన్స్‌ ద్వారా వీడియో కాల్‌ సేవలు
⦁ సెట్‌ టాప్‌ బాక్సు ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా వీడియో కాల్‌ ఉచితం
⦁ జియో గిగా ఫైబర్‌ ద్వారా సోషల్‌ గేమింగ్‌ పేరిట మల్టిపుల్‌ గేమింగ్‌ సేవలు
⦁ మిక్స్‌డ్‌ రియాలిటీ(ఎమ్మార్‌) పేరిట సరికొత్త వర్చువల్‌-ఆగ్​మెంటెడ్​ రియాలిటీ అనుభూతి
⦁ ఏఆర్‌, వీఆర్‌ సేవల కలయికగా మిక్స్‌డ్‌రియాలిటీ(ఎమ్మార్‌)
⦁ ఎమ్మార్‌ ద్వారా అధునాతనమైన విజ్ఞాన, వినోద సేవలు

అంతర్జాల ఆధారిత సేవలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం చేసింది రిలయన్స్ సంస్థ. జియో గిగా ఫైబర్​, సెట్​టాప్​ బాక్స్​, మిక్స్​డ్​ రియాలిటీ(ఎమ్మార్​) కలయికగా సరికొత్త విప్లవానికి నాంది పలికింది రిలయన్స్​. 'ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్' కాన్సెప్ట్​ ద్వారా ఈ సేవలను అందించనుంది.

AP Video Delivery Log - 0200 GMT News
Monday, 12 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0149: US TX Bulletproof Backpacks AP Clients Only 4224654
US shootings give rise to bullet-proof backpacks
AP-APTN-0059: Pakistan Kashmir Appeal Part no use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4224649
Wife of Kashmir leader appeals for UN intervention
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Sep 26, 2019, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.