ETV Bharat / bharat

భారత్​లో కరోనా పాజిటివ్​ రేటు తగ్గుదల

author img

By

Published : Oct 18, 2020, 10:26 AM IST

భారత్​లో కొవిడ్​-19 పాజిటివ్​ కేసుల రేటు తగ్గుతుంది. రోజువారీ పరీక్షల్లో పాజిటివ్​ కేసులు 8 శాతానికి దిగువనే నమోదవుతున్నాయి.

covid positivity rate in india
భారత్​లో పాజిటివ్​ రేటు తగ్గుతోంది

కరోనా ధాటికి ఇబ్బందిపడుతున్న దేశాల్లో భారత్​ ఒకటి. అయితే వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఎక్కువ సంఖ్యలో నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వాటిల్లో పాజిటివ్​ రేటు తక్కువగా ఉండటం శుభపరిణామం. రోజువారీ పరీక్షల్లో దాదాపు 8 శాతానికి దిగువనే బాధితుల సంఖ్య నమోదవుతోంది. ఆదివారం ఈ మేరకు వివరాలను వెల్లడించింది కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ.

covid positivity rate in india
భారత్​లో కరోనా పాజిటివ్​ రేటు తగ్గుదల

దేశవ్యాప్తంగా టెస్టింగ్​ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జనవరి నాటికి కోటి టెస్టులు చేయగా.. అక్టోబర్​ నాటికి ఆ సామర్థ్యం 9.32 కోట్లకు చేరింది. అధిక సంఖ్యలో టెస్టులు చేయడం వల్లే బాధితులను గుర్తించడం సహా ఐసోలేషన్​ సేవలు, కరోనా చికిత్స అందించడం సులభం అవుతోందని తెలిపారు. కట్టుదిట్టమైన చర్యల వల్లే దేశంలో మరణాల రేటు కనిష్ఠంగా ఉందని వెల్లడించారు.

కేసులు...

భారత్​లో కొత్తగా 61వేల 871 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,033 మంది వైరస్ ధాటికి బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 1,14,031కి చేరింది. అక్టోబర్​ 17న.. దేశంలో 9లక్షల 70వేల 173 శాంపిళ్లు పరీక్షించారు. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 9కోట్ల 42లక్షల 24వేల 190కి చేరింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.