ETV Bharat / bharat

'దీటైన స్పందనకు భారత నౌకాదళం సిద్ధం'

author img

By

Published : Aug 20, 2020, 5:00 AM IST

NAVY RAJNATH
నౌకదళం

భారత ప్రాదేశిక జలాల్లో సన్నద్ధతపై నౌకాదళాన్ని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రశంసించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా సున్నిత ప్రాంతాల్లో యుద్ధనౌకలు, జలాంతర్గాములను మోహరించటం గొప్ప విషయమని పేర్కొన్నారు. భారత సముద్ర ప్రయోజనాలను రక్షించేందుకు నౌకదళం కృషి చేస్తోందని కొనియాడారు.

భారత నౌకాదళ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఎలాంటి సవాళ్లనైనా నౌకాదళం ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా యుద్ధనౌకలు, విమానాలు మోహరించటాన్ని ప్రశంసించారు.

దిల్లీలోని నౌకాదళ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రారంభమైన నావల్‌ కమాండర్ల సమావేశానికి రాజ్​నాథ్ హాజరయ్యారు. మూడు రోజులపాటు జరిగే ఈ కాన్ఫరెన్స్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రాదేశిక జలాల రక్షణలో భారత నౌకాదళం పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించారు.

"సున్నితమైన ప్రదేశాల్లో యుద్ధ నౌకలు, విమానాలను వెూహరించడం ద్వారా దేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి నౌకాదళం కృషి చేస్తోంది. ఇందుకు సంబంధించిన విస్తరణ మిషన్​ను సమర్థంగా నిర్వహిస్తోంది. ప్రాదేశిక జలాలపై అవగాహనతోపాటు వేగంగా సాయం అందించేలా ఈ చర్యలు దోహదపడుతాయి. ఫలితంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనా దీటుగా స్పందించేందుకు అవకాశం ఉంటుంది."

- రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రాజ్​నాథ్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హిందూ మహాసముద్రంలోని కీలక ప్రాంతాల్లో యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారత నేవీ మోహరించింది. 2017 నుంచి మిషన్​ ఆధారిత ప్రణాళిక ప్రకారం ఈ చర్యలు చేపడుతోంది భారత నౌకాదళం.

ఇదీ చూడండి: భారత్​-చైనా మధ్య గురువారం సరిహద్దు చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.