ETV Bharat / bharat

'రక్షణ రంగం విదేశాలపై ఆధారపడొద్దు'

author img

By

Published : Aug 14, 2020, 5:01 AM IST

India cannot keep depending on imported defence supplies: Rajnath Singh
'రక్షణ రంగం విదేశాలపై ఆధారపడొద్దు'

ఇతర రంగాలతో పోల్చితే రక్షణ రంగంలో స్వావలంబన అత్యంత కీలకమన్నారు ఆ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్. సైనిక అవసరాల కోసం విదేశాలపై ఆధారపడకూడదన్నారు. రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోకుండా స్వదేశంలోనే అన్నీ తయారు చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు.

ఇకపై సైనిక అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదన్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. రక్షణ రంగంలో స్వావలంబన అత్యంత కీలకమైన విషయమని తెలిపారు. రక్షణ పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా అన్నీ స్వదేశంలోనే తయారు చేసుకోవాలన్నారు. పలు రక్షణరంగ ప్రభుత్వ పరిశ్రమలు, ఆర్డాన్స్​ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్​బీ) తయారు చేసిన నూతన ఉత్పత్తులను ఆన్​లైన్​ కార్యక్రమంలో గురువారం ప్రారంభించారు రాజ్​నాథ్​. అనంతరం అత్మనిర్భర్​ భారత్​ సాధన ఆవశ్యకతను వివరించారు.

" అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా భద్రతే తొలి ప్రాధాన్యం. తమని తాము రక్షించుకునే సామర్థ్యం ఉన్న దేశాలు అంతర్జాతీయంగా బలమైన దేశాలుగా గుర్తింపు తెచ్చుకుంటాయి. మన రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల ప్రభుత్వాలు, దిగుమతులు, విదేశీ రక్షణ ఉత్పత్తులపై ఆధారపడకూడదు. అది బలమైన అత్మనిర్భర్​ భారత్ సాధన భావాలకు సరికాదు."

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

రక్షణరంగ ప్రభుత్వ పరిశ్రమలు, ఓఎఫ్​బీ తయారు చేసిన నూతన ఉత్పత్తులలో నాగ్ మిసైల్​ క్యారియర్​, స్నైపర్​ రైఫిల్, అండర్ వాటర్​ రిమోట్ ఆపరేటెడ్​ వాహనాలు వంటివి ఉన్నాయి.

ఆత్మనిర్భర్​ భారత్​ సాధనే లక్ష్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 101 రక్షణ పరికరాలపై ఇటీవలే నిషేధం విధించింది కేంద్రం.

ఇదీ చూడండి: 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.