ETV Bharat / bharat

భారత వైమానిక దళంలోకి 'ఫ్లయింగ్​ బుల్లెట్లు'

author img

By

Published : May 27, 2020, 12:34 PM IST

18వ స్క్వాడ్రన్ ఫ్లయింగ్​ బుల్లెట్స్​ సేవలను నేటి నుంచి వినియోగించనుంది భారత వైమానిక దళం. తమిళనాడులోని సూలూరు ఎయిర్​బేస్​లో ఎయిర్​ చీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ భదౌరియా.. ఈ ఫ్లయింగ్​ బుల్లెట్ల సేవలను ప్రారంభించారు.

IAF Chief flies LCA Tejas; squadron 'Flying Bullets' operationalised
భారత వైమానిక దళంలోకి 'ఫ్లయింగ్​ బుల్లెట్లు'

భారత వైమానిక దళానికి చెందిన 18వ స్క్వాడ్రన్ ఫ్లయింగ్ బుల్లెట్ల సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. తేజస్ యుద్ధ విమానాలతో కూడిన ఈ రెండో స్క్వాడ్రన్‌ను వైమానిక దళాధిపతి మార్షల్‌ రాకేశ్​ కుమార్​ సింగ్​​ భదౌరియా వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. తమిళనాడులోని సూలూరు వైమానిక స్థావరంలో వీటి సేవలకు పచ్చజెండా ఊపారు భదౌరియా.

భారత వైమానిక దళంలోకి 'ఫ్లయింగ్​ బుల్లెట్లు'

1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మిగ్‌-27 యుద్ధవిమానాలతో కూడిన ఫ్లయింగ్‌ బుల్లెట్స్....అద్భుత పోరాట పటిమను కనబరిచాయని భదౌరియా కొనియాడారు. ప్రస్తుతం మిగ్​-27 యుద్ధవిమానాల స్థానంలో.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్‌ యుద్ధవిమానాలను ప్రవేశపెట్టనున్నారు. తేజస్ యుద్ధ విమానాలు 18వ స్క్వాడ్రన్ ఫ్లయింగ్ బుల్లెట్స్‌గా సేవలు అందించనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.