ETV Bharat / bharat

భార్యకు బెయిల్ వస్తే.. భర్త విడుదలయ్యాడు!

author img

By

Published : Jul 26, 2020, 5:38 PM IST

భార్యాభర్తలిద్దరూ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సెంట్రల్ జైల్లో ఉన్నారు. వారిద్దరిలో భార్యకు మాత్రమే మద్రాసు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చింది భార్యకైతే.. భర్తను విడుదల చేశారు అధికారులు. తర్వాత ఏం అయ్యిందంటే...

Husband released on bail instead of wife from salem prison in tamilnadu
భార్యకు బెయిల్ వస్తే.. భర్త విడుదలయ్యాడు!

తమిళనాడు సాలెం జిల్లా, ఎత్తాపుర్​కు చెందిన దంపతులు రంజిత్ కుమార్, పవిత్ర.. అదే గ్రామానికి చెందిన సదాశివం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జులై 23న జరిగిన ఈ ఘటన అనంతరం.. ఇద్దర్నీ సాలెం సెంట్రల్ జైల్లో రిమాండ్​కు తరలించారు పోలీసులు.

అదే రోజున మద్రాసు హైకోర్టులో పవిత్ర బెయిల్ పిటిషన్ వేయగా.. దాన్ని మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలు అందుకున్న అధికారులు.. పవిత్రను విడుదల చేయాల్సిందిపోయి పవిత్ర భర్త రంజిత్​ను విడుదల చేశారు.

హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. పవిత్రను ఎందుకు విడుదల చేయలేదని అధికారులను ప్రశ్నించారు పవిత్ర బంధువులు. తప్పు తెలుసుకున్న జైలు అధికారులు హుటాహుటిన ఎత్తాపుర్​కు చేరుకొని, రంజిత్​ను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు తీసుకొచ్చారు. అనంతరం సాలెం మహిళా జైలు నుంచి పవిత్రను విడుదల చేశారు.

ఇదీ చదవండి: తల్లడిల్లిన తల్లి హృదయం.. స్కూటీపైనే 1800 కి.మీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.