ETV Bharat / bharat

ముంబయిని కుదిపేస్తున్న భారీ వర్షాలు

author img

By

Published : Jul 16, 2020, 12:19 PM IST

Updated : Jul 16, 2020, 12:31 PM IST

ముంబయిని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో ముంబయితో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Heavy showers in Mumbai, more rains likely: IMD
ముంబయిని కుదిపేస్తున్న భారీ వర్షాలు

భారీ వర్షాలకు ముంబయి వణికిపోతోంది. కుండపోత వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Heavy showers in Mumbai, more rains likely: IMD
రోడ్లన్నీ జలమయం

దేశ ఆర్థిక రాజధానితో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ అర్ధరాత్రి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బాంద్రాలో 201 మిల్లీమీటర్లు, మహాలక్ష్మి ప్రాంతంలో 129 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

Heavy showers in Mumbai, more rains likely: IMD
చెరువులను తలపిస్తున్న రోడ్లు

ముంబయి సబర్బన్​లో 191.2 మి.మీ, దక్షిణ ముంబయిలో 156.4 మి.మీ, రత్నగిరి జిల్లాలో 127.2 మి.మీ, మరాఠ్​వాడా ప్రాంతంలోని నాందేడ్, ఉస్మానాబాద్ జిల్లాల్లో వరుసగా 96.4 మి.మీ, 25.8 మి.మీ, ఇలా మరికొన్ని జిల్లాల్లోనూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

మరో 24 గంటల పాటు ఇలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను బయటకు రావద్దని హెచ్చరించారు.

ఇదీ చూడండి:నెల రోజులు.. రూ.263 కోట్లు నీటిపాలు!

Last Updated : Jul 16, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.