ETV Bharat / bharat

రాజ్యసభ సభ్యునిగా జస్టిస్​ గొగొయి ప్రమాణం

author img

By

Published : Mar 19, 2020, 12:27 PM IST

రాజ్యసభ సభ్యునిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయి ప్రమాణస్వీకారం చేశారు. ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయన చేత ప్రమాణం చేయించారు. జస్టిస్​ గొగొయిను రాజ్యసభకు నామినేట్​ చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​.

gogoi-takes-oath-as-rs-member
రాజ్యసభ సభ్యునిగా జస్టిస్​ గొగొయ్​ ప్రమాణం

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ గొగొయి​ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారి తీరుపై వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు.

జస్టిస్​ గొగొయి​ను రాజ్యసభకు నామినేట్​ చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​.

చారిత్రక తీర్పులు..

సీజేఐగా 2018 అక్టోబరు 3 నుంచి 2019 నవంబరు 17 వరకు విధులు నిర్వర్తించారు గొగొయి. ఈయన తన 13 నెలల పదవీ కాలంలో ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు.

దశాబ్దాలుగా నలిగిన అయోధ్య కేసులో తీర్పుతో చారిత్రక పరిష్కారం చూపారు జస్టిస్ గొగొయి. రఫేల్​ యుద్ధవిమానం, శబరిమల వివాదాలపై కూడా సంచలనాత్మక తీర్పులు ఇచ్చారు.

జస్టిస్​ గొగొయ్​ ప్రమాణ స్వీకారం

ఇదీ చూడండి: రాజ్యసభలో 37 స్థానాలు ఏకగ్రీవం- 26న ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.