ETV Bharat / bharat

ఫిబ్రవరి 13 వరకే రాజ్యసభ కార్యకలాపాలు!

author img

By

Published : Jan 31, 2021, 8:01 PM IST

First part of budget session to end on Feb 13: Sources
రాజ్యసభ షెడ్యూల్​లో మార్పు- ఫిబ్రవరి 13నే సభ కార్యకలాపాలు

రాజ్యసభ షెడ్యూల్​లో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న సభా కార్యకలాపాలు కొనసాగుతాయని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. అదే రోజు సభ కార్యకలాపాలు ముగుస్తాయని తెలుస్తోంది.

రాజ్యసభ షెడ్యూల్​లో స్వల్ప మార్పులు జరిగాయని సమాచారం. బడ్జెట్​ సమావేశాల్లోని తొలి సెషన్​లో రాజ్యసభ కార్యకలాపాలు 13నే ముగుస్తాయని పెద్దలసభ వర్గాలు తెలిపాయి. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాతే షెడ్యూల్​లో మార్పులు చేసినట్లు పేర్కొన్నాయి.

ఫిబ్రవరి 15కు బదులు 13న సభ నిర్వహించాలన్న ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచన మేరకు మార్పులు చేసినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం. ఇదే విషయంపై అఖిలపక్షం సమావేశంలో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్​పై జరిగే చర్చల్లో సభ్యులంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని అఖిలపక్ష భేటీలో రాజ్యసభ ఛైర్మన్.. నేతలను కోరారని వివరించారు. ప్రతి అంశంపై సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం సాధ్యపడక పోవచ్చని అఖిలపక్ష సమావేశంలో ఛైర్మన్ స్పష్టం చేశారని రాజ్యసభ వర్గాలు పేర్కొన్నాయి.

ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్​ ప్రకారం.. శని, ఆదివారాలు సభా కర్యకలాపాలు జరగవు. అయితే ఫిబ్రవరి 15నే రాజ్యసభను ముగించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : వెంకయ్య అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.