ETV Bharat / bharat

పోరుబాటలో అన్నదాతలు- ట్రాక్టర్​ ర్యాలీతో నిరసన

author img

By

Published : Jan 7, 2021, 2:08 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న అన్నదాతలు.. గురువారం ట్రాక్టర్ ర్యాలీ చెేపట్టారు. గణతంత్ర దినోత్సవం నాడు రాజ్​పథ్​లో నిర్వహించబోయే.. కవాతుకు రిహార్సల్​గా దీన్ని జరిపారు. 3,500కు పైగా ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే.. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘాల నాయకులు మరోసారి హెచ్చరించారు.

tractor march
పోరుబాటలో 'ట్రాక్టర్'​ ఎక్కిన అన్నదాతలు

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు.. గురువారం ట్రాక్టర్​ ర్యాలీ చేపట్టారు. సింఘు, టిక్రీ, గాజీపుర్​ దీక్షాస్థలి నుంచి వాహనాల ప్రదర్శన నిర్వహించారు. పటిష్ఠ బందోబస్తు మధ్య వేలాది మంది అన్నదాతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జనవరి 26న దిల్లీలోని రాజ్​పథ్​లో నిర్వహించే కవాతుకు ముందస్తు కసరత్తుగా దీన్ని భావిస్తున్నారు.

tractor march
ర్యాలీని ప్రారంభిస్తున్న రైతులు
tractor march
ర్యాలీలో బారులు తీరిన ట్రాక్టర్లు

గురువారం ఉదయం 11 గంటలకు దీక్షాస్థలి నుంచి కుండ్లి-మనేస్వర్​-పల్వాల్​ వైపు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మార్గాల్లో దిల్లీ, హరియాణాకు చెందిన పోలీసులు బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. 3,500కు పైగా ట్రాక్టర్లు, ట్రాలీలతో రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు భారతీ కిసాన్​ ఏక్తా యూనియన్(బీకేయూ)​ అధ్యక్షుడు జోగీందర్​ సింగ్​ తెలిపారు.

tractor march
దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు
tractor march
పోలీసుల పటిష్ఠ బందోబస్తు

బీకేయూ నేత రాకేష్​ తికైత్​ నేతృత్వంలో మొదలైన ఈ యాత్ర పల్వాల్​ వైపు కొనసాగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే.. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సంయుక్త్​ కిసాన్​ మోర్చా సీనియర్​ సభ్యుడు అభిమన్యు కోహర్​ తెలిపారు. హరియాణా నుంచి దాదాపు 2,500 ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయని చెప్పారు.

tractor march
సింఘు - టిక్రీ రహదారిపై మోహరించిన పోలీసు బలగాలు
tractor march
సింఘు - టిక్రీ రహదారిపై మోహరించిన పోలీసు బలగాలు

సింఘు, టిక్రీ సరిహద్దులోని నాలుగు ప్రాంతాల్లో ఈ ట్రాక్టర్​ ర్యాలీ ప్రారంభమైంది. సింఘు - టిక్రీ, టిక్రీ - కుండ్లీ, గాజీపుర్​ - పల్వాల్​, రేవసాన్​- పల్వాల్​ వరకు ఈ యాత్ర మొదలుపెట్టారు. దిల్లీ సరిహద్దులో తీవ్రమైన చలి, వర్షం వణికిస్తున్న అన్నదాతలు పట్టువిడవకుండా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:లైవ్​: 'ట్రాక్టర్​' ఎక్కిన రైతన్న- సాగు చట్టాలపై పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.