ప్లాస్టిక్​లో జీవం పోసుకున్న 'నిలువెత్తు పచ్చదనం'

author img

By

Published : Sep 18, 2020, 9:53 AM IST

environmentalist-in-jammu-creates-vertical-gardens-using-plastic-bottles
ప్లాస్టిక్ లో జీవం పోసుకున్న 'నిలువెత్తు పచ్చదనం'! ()

ప్లాస్టిక్ వ్యర్థాల్లో పచ్చదనానికి జీవం పోస్తున్నారు జమ్మూకశ్మీర్​కు చెందిన ఓ పర్యావరణవేత్త. గోడలపై నిలువు గార్డెన్లు సృష్టించి స్థలాన్ని, నీటిని ఆదా చేస్తున్నారు.

ప్లాస్టిక్​లో జీవం పోసుకున్న 'నిలువెత్తు పచ్చదనం'

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి.. వ్యర్థాలతో నిలువు హరితవనాలను సృష్టిస్తున్నారు జమ్మూకశ్మీర్​కు చెందిన పర్యావరణవేత్త డాక్టర్ నాజియా రసూల్.

environmentalist-in-jammu-creates-vertical-gardens-using-plastic-bottles
విద్యార్థులకు నిలువు గార్డెన్లపై అవగాహన కల్పిస్తూ...

"నిలువు గార్డెన్లతో.. పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాదు. మొక్కలకు పోసే నీటిని వృథా కాకుండా చూడొచ్చు. స్థలం కూడా తక్కువ ఆక్రమిస్తుంది. ఓ సెమినార్​లో పాల్గొన్నప్పుడే ఈ నిలువు గార్డెన్ల ఆలోచన వచ్చింది. నేను బోధిస్తున్న ప్రభుత్వ మహిళా కళాశాలలో మొదట ఈ ప్రయోగం చేశాను. ఆపై పోలీస్ పబ్లిక్ స్కూల్ వద్ద, జమ్ము వర్సిటీ గోడలపై సృష్టించాను. కరోనా కాలంలో ఒత్తిడిని పోగొట్టడానికి ఈ నిలువు గార్డెన్లు ఉపయోగపడతాయి. "

-డాక్టర్ నాజియా రసూల్ , పర్యావరణవేత్త

వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్ల మీద బొమ్మలు గీసి ఆకర్షణీయంగా మార్చేశారు నాజియా. వాటిలో మొక్కలు నాటి ఓ క్రమం ప్రకారం గోడకు అతికించారు. పై వరుసలో నీరు పోస్తే ఆ నీరు కింది వరుసకూ చేరుతుందంటున్నారు.

environmentalist-in-jammu-creates-vertical-gardens-using-plastic-bottles
వ్యర్థాలను అందంగా అలంకరిస్తూ..

ఈ నిలువు గార్డెన్లు పర్యావరణం అందాన్ని పెంచడమే కాదు, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయంటూ నాజియా ఆలోచనను ప్రశంసిస్తున్నారు మిగతా ప్రొఫెసర్లు. ఆఫీసులు, ఇళ్ల గోడలపై ఇలాంటి నిలువు గార్డెన్లు పెంచుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించొచ్చు అంటున్నారు.

environmentalist-in-jammu-creates-vertical-gardens-using-plastic-bottles
నిలువెత్తు పచ్చదనం
environmentalist-in-jammu-creates-vertical-gardens-using-plastic-bottles
గోడెక్కిన బాటిల్ కుండీలు

"నాజియా చేసిన పనిని నేను ప్రశంసిస్తున్నాను. భూభాగం తరిగిపోతున్న వేళ.. పచ్చదనాన్ని పెంచుకునే ఆలోచన ఇది. కరోనా కాలంలో ఆయుర్వేద గుణాలున్న మొక్కలనూ ఈ పద్ధతిలో పెంచుకోవచ్చు. స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందొచ్చు."

-ప్రొఫెసర్ రాజ్ కుమార్ రాంపాల్, నాజియా సహోద్యోగి

ఇదీ చదవండి: తాగి నదిలో దూకి.. పోలీసులను తిప్పలు పెట్టి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.