ETV Bharat / bharat

తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ ఎన్నిక లాంఛనమే!

author img

By

Published : May 30, 2020, 5:18 PM IST

Elections for five non-permanent members of UNSC next month; India assured of seat
యూఎన్​ఎస్​సీ తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ ఎన్నిక లాంఛనం!

జూన్​ 17న ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​ మరోసారి ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్​ఎస్​సీ)లో తాత్కాలిక సభ్యదేశంగా....భారత్‌ మరోసారి ఎన్నిక కావటం లాంఛనంగా మారింది. ఐదు తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకునేందుకు.. జూన్‌ 17న ఎన్నికలు నిర్వహించాలని ఐరాస జనరల్​ అసెంబ్లీ నిర్ణయించింది. ఆసియా- పసిఫిక్‌ నుంచి పోటీ చేస్తోన్న ఏకైక దేశమైన భారత్.. ఏకగ్రీవంగా ఎన్నిక కావటం ఖాయంగా కనిపిస్తుంది.

గత ఏడాది జూన్‌లోనే చైనా, పాకిస్థాన్‌ సహా ఆసియా-పసిఫిక్‌ కూటమి దేశాలు.. భారత్‌ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాయి. రెండేళ్లపాటు భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగనున్న భారత్‌.. ఇప్పటివరకూ ఏడుసార్లు ఎన్నికైంది. ఇదే సమయంలో ఐరాస ఆర్థిక, సామాజిక మండలికి సైతం తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకోనున్నారు.

కరోనా ప్రభావం...

ఈ ఎన్నికలపైనా కరోనా ప్రభావం పడింది. సహజంగా ఈ ఎన్నికలను అసెంబ్లీ హాల్​లో నిర్వహిస్తారు. 193 సభ్య దేశాలు తమ ఓటును బాలెట్​ పేపర్​లో నిక్షిప్తం చేస్తాయి. కానీ ఈసారి పరిస్థితులు మారిపోయాయి. ఈ వివరాలను ఎన్నికలకు కనీసం 10 పని దినాలకు ముందు ఆయా దేశాలకు అందజేస్తుంది ఐరాస.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.