ETV Bharat / bharat

ఆర్నెల్లుగా బందీగా వృద్ధ జంట- అసలేం జరిగింది?

author img

By

Published : Feb 1, 2021, 2:03 PM IST

Updated : Feb 1, 2021, 2:45 PM IST

ఉత్తరాఖండ్​లో విస్తుపోయే ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తి చేసిన తప్పిదానికి.. నెలల తరబడి గదికే పరిమితమైంది ఓ వృద్ధ జంట. తిండి, నీరు లేక బలహీనపడిన వారు ప్రస్తుతం.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Elderly couple locked inside room for months in Uttarakhand
ఆర్నెల్లు గదిలో బంధీయైన వృద్ధ దంపతులు

ఉత్తరాఖండ్​​లో అనూహ్య ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు ఆర్నెల్ల పాటు గదిలో బందీ అయిన ఓ వృద్ధ జంటను గుర్తించారు పోలీసులు. నెలలపాటు నీరు, ఆహారంలేని ఆ దంపతులు బక్కచిక్కిపోయారు. తీవ్ర అనారోగ్యం బారినపడిన వారిని.. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Jaman Singh Negi
జమాన్​ సింగ్ నేగి
Devaki Devi
దేవకీ దేవి

అసలేం జరిగిందంటే.?

మాజీ సైనిక ఉద్యోగి జమాన్​ సింగ్​ నేగి(60), భార్య దేవకీ దేవితో కలిసి బాగేశ్వర్​ జిల్లాలో నివాసముంటున్నారు. ఇద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి.. గదికి తాళం వేసి వెళ్లారు. చేసేదేమీ లేక.. ఆ వృద్ధులిద్దరూ సుమారు ఆరు నెలల పాటు అందులోనే ఉండిపోయారు.

దిల్లీలో ఉండే వారి కుమారుడు జగత్​సింగ్​.. తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఎన్నిసార్లు ఫోన్​ చేసినా ఫలితం లేకపోయింది. అనుమానం వచ్చిన ఆయన.. పొరుగువారిని సంప్రదించగా అసలు విషయం బయటపడింది. తాళం వేసిన గది దృశ్యాలను వీడియో తీసి.. జగత్​కు పంపాడు స్థానికుడు. విషయం తెలియగానే.. వెంటనే బాగేశ్వర్​కు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు జగత్​. పోలీసులు అక్కడికి చేరుకుని తాళం పగులగొట్టి వారిని రక్షించారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మూడేళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడి అత్యాచారం

Last Updated : Feb 1, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.