ETV Bharat / bharat

మద్యం తాగొద్దన్నందుకు దాడి- వృద్ధ దంపతులు మృతి

author img

By

Published : Nov 16, 2020, 7:29 PM IST

ఆరుబయట మద్యం తాగొద్దని చెప్పినందుకు వృద్ధ దంపతులను తీవ్రంగా కొట్టి వారి మరణానికి కారణమయ్యారు దుండగులు. ఈ ఘటన ఝార్ఖండ్​ గుమ్లా జిల్లాలోని సత్పారా ఖట్టా గ్రామంలో జరిగింది. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Elderly couple beaten to death
వృద్ధ దంపతులు మృతి

బహిరంగ ప్రదేశంలో మద్యం తాగొద్దని చెప్పినందుకు వృద్ధ దంపతులపై దాడి చేశారు దుండగులు. తీవ్రంగా కొట్టటం వల్ల ఆ దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఝార్ఖండ్​ గుమ్లా జిల్లాలో జరిగింది.

జిల్లాలోని సత్పారా ఖట్టా గ్రామంలో ఆదివారం సాయంత్రం కొందరు బహిరంగ ప్రదేశంలో మద్యం తాగాారు. అది తప్పని చెప్పగా సైనీ గోప్​ (70), ఫులో దేవి (65)తో గొడవకు దిగారు. వృద్ధులని కూడా చూడకుండా వారిని విచక్షణ రహింతగా కొట్టారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు.

ఈ కేసుకు సంబంధించి ఐదుగురిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ జనార్దనన్​ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.

ఇదీ చూడండి:సెలూన్​కు కన్నం వేసి నగల దుకాణంలో చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.