ETV Bharat / bharat

'రైతుల పట్ల కేంద్రానికి ఇంత అహంకారమా?'

author img

By

Published : Jan 22, 2021, 12:44 PM IST

రైతుల పట్ల కేంద్రం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన కాంగ్రెస్​ వర్కింట్​ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సాగు చట్టాలను తమ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

Crucial CWC meeting underway, will fix schedule to elect party president
'రైతుల పట్ల కేంద్రానికి ఇంత అహంకారమా?'

కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రైతు సమస్యల పట్ల కేంద్రం దురహంకార వైఖరితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా.. సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించడం లేదని మిమర్శించారు. సాగు చట్టాలపై కాంగ్రెస్ మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ఉందని, వాటిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికే ప్రధాన అజెండాగా సీడబ్ల్యూసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌, ప్లీనరీ, ఇతర కీలక అంశాలపై భేటీలో చర్చించినట్లు కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి.

ఈ భేటీలో ప్రభుత్వ ఆర్థిక విధానాలను కూడా సోనియా తప్పుబట్టారు. ప్రమాదకర ప్రైవేటీకరణలో ప్రభుత్వం చిక్కుకుపోయిందన్నారు.

త్వరలో బడ్జెట్​ సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలు చాలా ఉన్నాయని సమావేశంలో సోనియా తెలిపారు. ప్రజా సమస్యలపై సభలో చర్చించాల్సిన అవసరముందన్నారు. అయితే చర్చలకు కేంద్రం సానుకూలంగా ఉంటుందో లేదో తెలియదన్నారు.

అర్ణబ్​ సంభాషణల లీక్​ అంశంపైనా సోనియా సమావేశంలో మాట్లాడారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో కేంద్రం రాజీపడటం బాధాకరమన్నారు.

ఇదీ చూడండి: క్షీణించిన శశికళ ఆరోగ్యం.. పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.