ETV Bharat / bharat

సాయుధ దళాల సంక్షేమానికి తోడ్పడండి: ప్రధాని

author img

By

Published : Dec 7, 2019, 1:32 PM IST

Updated : Dec 7, 2019, 3:30 PM IST

సాయుధ దళాల సంక్షేమం కోసం సాయుధ బలగాల పతాక నిధికి విరాళాలివ్వాలని దేశ పౌరులకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. సాయుధుల సేవలను స్మరించుకుంటూ వారికి, వారి కుటుంబాలకు ప్రజలు అండగా ఉన్నారనే భరోసా కల్పించేందుకు.. ఏటా డిసెంబర్‌ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకుంటాం.

Contribute towards welfare of armed forces flag day says  PM narendra modi
సాయుధ దళాల సంక్షేమానికి తోడ్పడండి: ప్రధాని

సాయుధ దళాల పతాక నిధికి తోడ్పడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఫ్లాగ్​ డే సందర్భంగా ఆర్మీ, వాయుసేన, నౌకాదళాల పోరాట పటిమను ప్రధాని మోదీ కీర్తించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు సెల్యూట్‌ చేస్తున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా తెలిపారు.సైనిక సహాయ నిధికి ప్రజలు విరాళాలు ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

"సాయుధ దళాల పతాక దినోత్సవం (ఫ్లాగ్​ డే) సందర్భంగా మన దళాలు, వారి కుటుంబాల ధైర్యానికి నమస్కరిస్తున్నాను. మన దళాల సంక్షేమానికి తోడ్పడాలని మిమ్మల్ని కోరుతున్నాను " -ప్రధాని

contribute-towards-welfare-of-armed-forces-flag-day-says-pm-narendra-modi
సాయుధ దళాల సంక్షేమానికి తోడ్పడండి: ప్రధాని

1949 నుంచి ఏటా డిసెంబర్​ 7వ తేదీని సాయుధ దళాల పతాక దినోత్సవంగా జరుపుకుంటున్నారు భారతీయులు. వివిధ పోరాటాల్లో గాయపడిన సైనికులు, మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ బలగాల పతాక నిధిని వినియోగిస్తారు.

Dehradun (Uttarakhand), Dec 07 (ANI): Defence Minister Rajnath Singh reviewed Passing out Parade of Indian Military Academy (IMA) in Dehradun on Dec 07. The passing out parade was being held on the occasion of Armed Forces Flag Day to honor India's bravehearts. The event is held twice a year by the Indian Military Academy. The passing out parade is the most spectacular among the end-of-term events at Indian Military Academy.
Last Updated : Dec 7, 2019, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.