ETV Bharat / bharat

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ 'భారత్​ బచావో'

author img

By

Published : Nov 16, 2019, 5:26 PM IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 30న దిల్లీలో  భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్​ పార్టీ. ఈ నెల​ 5 నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరుగుతున్న నిరసనలకు ముగింపు కార్యక్రమంగా ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీనికి 'భారత్​ బచావో' గా నామకరణం చేసింది కాంగ్రెస్​.

కేంద్రం వైఫల్యాలపై దిల్లీలో కాంగ్రెస్​ భారీ ర్యాలీ

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ 'భారత్​ బచావో'

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 30న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 'భారత్ బచావో' ర్యాలీని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మోదీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 5 నుంచి రాష్ట్ర , జిల్లా స్థాయిల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు ముగింపుగా ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన దిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు సహా ఆర్థిక మందగమనం, రైతు సమస్యలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. దేశంలో నెలకొన్న సమస్యలపై ఆందోళనలు ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి:రాహుల్​ క్షమాపణకై దేశవ్యాప్తంగా భాజపా ఆందోళనలు

AP Video Delivery Log - 1000 GMT News
Saturday, 16 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0958: US NJ Shooting Aftermath 2 AP Clients Only 4240232
Investigators search the scene of shooting
AP-APTN-0949: Hong Kong Pride AP Clients Only 4240231
Pride parade in Hong Kong calling for equal rights
AP-APTN-0829: US NJ Shooting Aftermath AP Clients Only 4240230
Gunfire sends people running at NJ high school game
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.