ETV Bharat / bharat

'ఆయుర్వేదం'తో 5 రోజుల్లో కరోనా మాయం!

author img

By

Published : Sep 28, 2020, 7:16 PM IST

ఆయుర్వేద విధానంలో కరోనా ఔషధాన్ని కనిపెట్టేందుకు చేపట్టిన క్లినికల్​ ట్రయల్స్​లో అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ ఔషధాలను ఉపయోగించి చికిత్స పొందిన రోగుల్లో 86.66 శాతం మందికి ఐదో రోజున కరోనా నెగిటివ్‌ అని వెల్లడైంది.

Clinical trial of Ayurvedic remedy for Covid-19
కరోనాకు ఆయుర్వేదం: సంచలన ఫలితాలు

కరోనా వైరస్‌ మహమ్మారికి ఆయుర్వేద విధానంలో ఔషదాన్ని కనుగొనేందుకు చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడినట్టు తెలిసింది. శాస్త్రీయ విధానంలో కంటే ఆయుర్వేద పద్ధతిలో చికిత్స పొందుతున్న రోగులకు కొవిడ్-19 సమస్య త్వరగా నయమౌతోందని ఈ ఫలితాల్లో వెల్లడైంది. క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన అనంతరం.. ఇమ్మ్యునో ఫ్రీ, రెజిమ్యూన్‌లకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను దేశంలోని మూడు ఆస్పత్రుల్లో నిర్వహించారు. శ్రీకాకుళంలోని గవర్నమెంట్‌ మెడికల్‌ హాస్పిటల్‌, గుజరాత్‌, వడోదరా లోని పారుల్‌ సేవాశ్రమ్‌ ఆస్పత్రి, మహారాష్ట్ర, పుణెలో లోక్‌మాన్య ఆస్పత్రిలో ఈ క్లినికల్‌ పరీక్షలు జరిగాయి.

కోరివల్‌ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన ఇమ్మ్యునో ఫ్రీ, బయోజెటికాకు చెందిన రెజిమ్యూన్‌ అనే ఆయుర్వేద ఔషధాలు కొవిడ్‌ చికిత్సలో చక్కగా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఈ ఔషధాలను ఉపయోగించి ఆయుర్వేద విధానంలో చికిత్స పొందిన రోగుల్లో 86.66 శాతం మందికి ఐదవ రోజున కరోనా నెగిటివ్‌ అని వెల్లడైంది. కాగా, సంప్రదాయ విధానంలో ఇది కేవలం 60 శాతంగా ఉంది. ఇక చికిత్స ఆరంభించిన పది రోజుల అనంతరం అందరికీ నెగిటివ్‌గా వచ్చినట్టు తెలిసింది. సంప్రదాయ విధానంతో పోలిస్తే.. ఈ సహజ చికిత్సా విధానం సీ రిక్రియేటివ్‌ ప్రోటీన్‌, డి డైమర్‌, ఆర్‌టీ పీసీఆర్‌ తదితర పరీక్షల్లో కూడా 20 నుంచి 60 శాతం మెరుగైన ఫలితాలు సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.