ETV Bharat / bharat

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో బీఎస్​ఎఫ్ జవాన్ అరెస్టు!

author img

By

Published : Jul 12, 2020, 12:34 PM IST

డ్రగ్స్ స్మగ్లింగ్​కు పాల్పడిన ఓ బీఎస్​ఎఫ్ జవాన్​ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

BSF jawan arrested by Punjab police in drug smuggling case
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో బీఎస్​ఎఫ్ జవాన్ అరెస్టు

పంజాబ్​ పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఓ బీఎస్​ఎఫ్​ జవానును అరెస్టు చేశారు. అతని నుంచి ఆయుధాలను, మందుగుండు సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు పంజాబ్​లోని గురుదాస్​పూర్ జిల్లాకు చెందిన వ్యక్తి. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్​ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తించే అతడు.. డ్రగ్స్​ స్మగ్లింగ్​కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.

నిందితుడి నుంచి ఒక పిస్టల్, 9 ఎంఎం క్యాలిబర్ గన్​కు సంబంధించిన 80 బుల్లెట్లు, 12 రౌండ్ రైఫిల్​కు చెందిన 2 రౌండ్లు, 2 మ్యాగజైన్లు, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్విస్ట్...​

అయితే నిందితుడి పేరు... జమ్మూ లోని సాంబా సెక్టార్లో మోహరించిన బీఎస్​ఎఫ్ యూనిట్ జవాన్ల పేర్లలో లేదని అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

సరిహద్దు భద్రం

జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్​ల్లో... భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న 3,300 కి.మీ సరిహద్దు వెంబడి బీఎస్​ఎఫ్ జవాన్లు పహారా కాస్తుంటారు. వారి రక్షణలో దేశం భద్రంగా ఉంటోంది.

ఇదీ చూడండి: హురియత్ నయా చీఫ్ అష్రఫ్ సెహ్రాయ్ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.