ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో పాక్షికంగా ఇంటర్నెట్​ సేవల పునరుద్ధరణ

author img

By

Published : Jan 15, 2020, 8:22 AM IST

జమ్ముకశ్మీర్​లో ఇంటర్నెట్​ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. జమ్ములోని పలు ప్రాంతాలతో పాటు ఆస్పత్రులు, హోటళ్లు, రవాణా సంస్థల్లో బ్రాడ్​బ్యాండ్​, 2జీ ఇంటర్నెట్​ సేవలను అందుబాటులోకి తెచ్చింది అధికార యంత్రాంగం.

broadband-2g-internet-partially-restored-in-jk
జమ్ముకశ్మీర్​లో పాక్షికంగా ఇంటర్నెట్​ సేవల పునరుద్ధరణ

జమ్ముకశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్​ సేవలను పునరుద్ధరించేందుకు హోంశాఖ చర్యలు ప్రారంభించింది. తాజాగా జమ్ము, సాంబా, కతువా, ఉదంపుర్​, రియాసి జిల్లాల్లో అధికారిక వెబ్​సైట్లను అనుమతిస్తూ 2జీ పోస్ట్​పెయిడ్​ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రులు, హోటళ్లు, రవాణ సంస్థల్లో బ్రాడ్​బ్యాండ్ సేవలను కల్పించింది.

జమ్ముకశ్మీర్​లో ఇంటర్నెట్​ సేవలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడి యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ఇంటర్నెట్​ సేవలను పొందడం పాథమిక హక్కు అని విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

Intro:Body:

dd


Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.