ETV Bharat / bharat

నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ-ప్రగ్యాకు నో ఎంట్రీ

author img

By

Published : Dec 3, 2019, 5:55 AM IST

bjp parliament
నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ-ప్రగ్యాకు నో ఎంట్రీ

భాజపా పార్లమెంటరీ పార్టీ నేడు సమావేశం కానుంది. ఈ నెల 13 వరకు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేటి భేటీలో చర్చించనున్నారని సమాచారం. 'గాడ్సే దేశభక్తుడు' అన్న పార్టీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం ఆమెను పార్లమెంటరీ పార్టీ సమావేశానికి నిషేధించింది. ఈ నేపథ్యంలో ప్రగ్యా నేటి సమావేశానికి గైర్హాజరు కానున్నారు.

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్న నేపథ్యంలో భాజపా పార్లమెంటరీ పార్టీ నేడు సమావేశం కానుంది. పార్లమెంట్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేటి సమావేశంలో భాజపా నేతలు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన నేపథ్యంలో పార్లమెంట్​లో గతవారం దూమారం చెలరేగింది. ఈ కారణంగా ఆమెను పార్లమెంటరీ పార్టీ సమావేశానికి నిషేధిస్తూ భాజపా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె నేటి సమావేశానికి గైర్హాజరు కానున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఝార్ఖండ్​ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి : భారతీయ రైల్వే పనితీరు మెరుగుపడాలి : కాగ్‌

New Delhi, Dec 02 (ANI): After the brutal rape and murder of woman veterinary doctor in Hyderabad, MoS for Ministry of Home Affairs (MHA) G Kishan Reddy said that Central Government is ready to extend all support for speedy justice."Central Government is ready to extend all help to the state for speedy justice in the case", said Reddy.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.