ETV Bharat / bharat

కోరిక తీర్చలేదని శిశువును మంటల్లో వేసి...

author img

By

Published : Jan 31, 2021, 7:19 PM IST

తన లైంగిక కోరిక తీర్చేందుకు నిరాకరించిందన్న కోపంతో ఆమె కూతురిని మంటల్లో పడేశాడో వ్యక్తి. మూడునెలలు కూడా నిండని ఆ పసిపాప ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బిహార్​లోని ముజఫర్​పుర్​లో జరిగిందీ ఘటన.

Bihar: Man throws baby into fire as mother rejects sexual advances
కోరిక తీర్చలేదని శిశువుని మంటల్లోకి..

లైంగిక కోరిక తీర్చలేదని తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడో మూర్ఖుడు. మహిళ మీద కోపంతో మూడునెలల కూతురుని మంటల్లో పడేశాడు. ఈ అమానుష ఘటన బిహార్​లోని ముజఫర్​పుర్​లోని బోచహన్ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది.

కోపంతో మంటల్లోకి..

ఇంటి బయట చలిమంట కాగుతున్న మహిళ పక్కన కూర్చున్న ఒక వ్యక్తి.. లైంగిక కోరిక తీర్చాల్సిందిగా వేధించాడు. సదరు మహిళ ప్రతిఘటించగా.. ఆమె ఒడిలో ఉన్న మూడు నెలల శిశువును మంటల్లోకి విసిరేశాడు. మంటల్లో చిక్కుకున్న శిశువు కాళ్లు పాక్షికంగా కాలిపోయాయని.. ఇతర చోట్ల గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డీఎస్​పీ వైద్యనాథ్ సింగ్ తెలిపారు.

పోలీసులపై ఆరోపణలు..

అయితే ఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేసినా.. స్థానిక పోలీసులు పట్టించుకోలేదని శిశువు తండ్రి భర్త ఆరోపించాడు. జిల్లా ఎస్పీ జయంత్ కాంత్ జోక్యంతో దర్యాప్తు ప్రారంభించారని వాపోయాడు. నిందితుణ్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు.

ఇదీ చదవండి: యూపీలో మరో దారుణం- 12 ఏళ్ల బాలికపై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.