ETV Bharat / bharat

నేపాల్​ వల్లే బిహార్​కు ఇన్ని ఇబ్బందులు: నితీశ్

author img

By

Published : Aug 10, 2020, 6:54 PM IST

బిహార్​ను ముంచెత్తుతోన్న వరదలను అరికట్టేందుకు నేపాల్​ సహకరించటం లేదని ఆరోపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నేపాల్ అంశాన్ని లేవనెత్తారు. కేంద్రం జోక్యం చేసుకుని, సాయం చేయాలని కోరారు.

Nitish flags non-cooperation from Nepal
ఆ విషయంలో నేపాల్​ సహకరించటం లేదు: బిహార్​

సరిహద్దు జిల్లాల్లో వరదలను అరికట్టేందుకు నేపాల్​ సహకరించటం లేదని ఆరోపించారు బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. నేపాల్​ నుంచి వచ్చే నదులు ఉప్పొంగి రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో తీవ్ర నష్టం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

వరదల పరిస్థితి, సన్నద్ధతపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నేపాల్​ అంశాన్ని లేవనెత్తారు నితీశ్​. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రానికి సాయం చేయాలని కోరారు.

నేపాల్​లో కురుస్తోన్న భారీ వర్షాలతో ఉత్తర బిహార్​లో వరదలు ముంచెత్తాయి. భారత్​-నేపాల్​ మధ్య ఒప్పందాలను అనుసరించి బిహార్​ నీటి వనరుల విభాగం సరిహద్దు ప్రాంతాల్లో వరదల నిర్వహణ పనులు చేపట్టింది. కానీ, కొద్ది సంవత్సరాలుగా నేపాల్​ నుంచి మాకు పూర్తిస్థాయి సహకారం అందటం లేదు.

- నితీశ్​ కుమార్​, బిహార్​ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి: అలా ఏటా 100 ఏనుగులు, 500 మంది మనుషులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.