ETV Bharat / bharat

ఆర్మీ అధికారి అరుదైన ఫీట్​.. గిన్నిస్​లో చోటు..

author img

By

Published : Jan 16, 2021, 3:59 PM IST

Updated : Jan 16, 2021, 4:10 PM IST

army-officer-from-odisha-creates-guinness-book-of-world-records
ఆర్మీ అధికారి అరుదైన ఫీట్​.. గిన్నిస్​లో చోటు..

శీర్షాసనం వేయడమే ఓ సాహసం. అలా శీర్షాసనంలో మరో ఫీట్​ చేయడమంటే సవాలే. అలాంటిది 50ఏళ్ల వయసులో ఆ సవాల్​ను అలవోకగా చేసి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​​లో చోటు సంపాదించారో ఆర్మీ అధికారి.

ఓ అరుదైన ఫీట్​తో, గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​ ​సాధించారో ఆర్మీ అధికారి. ఏకంగా 63 నిమిషాల పాటు శీర్షాసనంలో ఉండి.. 6వేల సార్లు తన కాళ్లను వెనక్కి తగిలించే కష్టతరమైన ఫీట్​తో ఔరా అనిపించారు.

ఆర్మీ అధికారి అరుదైన ఫీట్​.. గిన్నిస్​లో చోటు..

ఒడిశా బాలేశ్వర్​ జిల్లా ఔపడ బ్లాక్​ పరిధిలోని బంగూర్​ గ్రామానికి చెందిన లక్ష్మిధర్​ భూయన్​.. 1992 నుంచి భారత సైన్యంలో పనిచేస్తున్నారు. ఈ 50ఏళ్ల లెఫ్టినెంట్​ కల్నల్​​కు మారథాన్​ రన్నర్​గానే కాక, యోగాలోనూ 34ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుత​ రికార్డ్​తో పాటు కోకా-కోలా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, బెస్ట్​ ఆఫ్​ ఇండియా రికార్డ్స్​, ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో తన పేరును లిఖించుకున్నారు.

ఇదీ చదవండి: తూటాల వర్షం మధ్య మానవతా పరిమళం

Last Updated :Jan 16, 2021, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.