ETV Bharat / bharat

బిహార్​ బరి: మూడోదఫాలో 31శాతం మందిపై క్రిమినల్​ కేసులు!

author img

By

Published : Nov 2, 2020, 6:08 PM IST

బిహార్​ మూడోదఫా ఎన్నికల్లో బరిలో నిలుస్తోన్న అభ్యర్థుల్లో 31 శాతం మంది నేర చరిత్ర ఉన్నవారేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్​) వెల్లడించింది. ఈ జాబితాలో 34 మంది అభ్యర్థులతో భాజపా తొలిస్థానంలో ఉండగా.. ఆర్జేడీ 32, జేడీయూ 21 మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Bihar phase 3 polls
బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు

బిహార్​ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 31 శాతం మంది నేర చరిత్ర ఉన్నవారేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్​) వెల్లడించింది. మొత్తం 1,195 మందిలో 371 మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నట్లు తెలిపింది. అందులో 282 (24 శాతం) మందిపై నాన్​ బెయిలెబుల్​, ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్ర నేరారోపణలు గల కేసులు ఉన్నట్లు వెల్లడించింది ఏడీఆర్​.

ప్రధాన పార్టీల్లో క్రిమినల్​ కేసులు ఉన్న అభ్యర్థుల వివరాలు..

పార్టీక్రిమినల్​ కేసులుతీవ్ర నేరారోపణలు
భాజపా34 22
ఆర్జేడీ32 22
జేడీయూ 2111
కాంగ్రెస్​1914
ఎల్​జేపీ1811
బీఎస్పీ54

లైంగిక వేధింపుల కేసుల్లో..

37 మందిపై లైంగిక వేధింపుల కేసులు ఉండగా.. ఐదుగురిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు ఉన్నట్లు ఏడీఆర్​ నివేదిక పేర్కొంది. 20 మందిపై హత్య, 73 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి.

మూడోదఫా ఎన్నికలు జరుగుతున్న మొత్తం స్థానాల్లో 72 నియోజకవర్గాలు రెడ్​ అలర్ట్​ కింద ఉన్నాయి. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది క్రిమినల్​ కేసుల్లో ఉన్నవారు పోటీలో నిలిచిన నియోజకవర్గాలను రెడ్​ అలర్ట్​గా పేర్కొంటారు.

30 శాతం మంది కోటీశ్వరులు..

బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 361 (30శాతం) మంది కోటీశ్వరులుగా పేర్కొంది ఏడీఆర్. వారి ఎన్నికల అఫిడవిట్​లో తమ ఆస్తుల విలువ కోట్లలో ఉందని వెల్లడించినట్లు తెలిపింది. అందులో భాజపా-31, కాంగ్రెస్​-17, ఆర్జేడీ-35, జేడీయూ-30, ఎల్​జేపీ-31, బీఎస్పీ-10 మంది అభ్యర్థులు కోటీశ్వరులని తెలిపింది. అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ 1.47 కోట్లుగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

ప్రభావం చూపని సుప్రీం ఆదేశాలు: ఏడీఆర్​

క్రిమినల్​ కేసుల్లోని అభ్యర్థుల ఎంపికపై సుప్రీం కోర్టు ఆదేశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయని పేర్కొన్నారు ఏడీఆర్​ వ్యవస్థాపక సభ్యులు జగదీప్​ ఛోకర్​. తమ పాతతరం పద్ధతులను అనుసరించి క్రిమినల్​ కేసుల్లో ఉన్నవారికి టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్లో 26-76 శాతం మేర క్రిమినల్​ కేసుల్లో ఉన్నవారికే టికెట్లు ఇచ్చాయన్నారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: రెండో విడత​కు సర్వం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.