ETV Bharat / bharat

భారత్​ బయోటెక్​ నాసల్​ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్​సిగ్నల్​

author img

By

Published : Sep 6, 2022, 3:03 PM IST

Updated : Sep 6, 2022, 3:42 PM IST

Bharat Biotech gets emergency use authorisation
Bharat Biotech gets emergency use authorisation

15:00 September 06

భారత్​ బయోటెక్​ నాసల్​ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్​సిగ్నల్​

Bharat Biotech Nasal Vaccine : భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. కొవిడ్‌పై పోరులో నాసల్​ వ్యాక్సిన్​ ఒక బిగ్‌ బూస్ట్‌ అని పేర్కొన్నారు.

18 ఏళ్లు దాటిన వారికి ఈ టీకా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతిని ఇచ్చింది. అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ముక్కు ద్వారా అందుబాటులోకి వచ్చిన తొలి కొవిడ్​ వ్యాక్సిన్​ ఇదే. ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ సహా పలు టీకాలు అందుబాటులో ఉన్నాయి.

ఇవీ చదవండి: నడిరోడ్డుపై పోలీసుల కొట్లాట.. విధుల నుంచి తొలగింపు

'భారత్​తో మాది అలాంటి స్నేహమే.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం పక్కా'

Last Updated :Sep 6, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.