ETV Bharat / bharat

Bank Jobs 2023 : బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లైకు మరో 10 రోజులే టైమ్​!

author img

By

Published : Jun 23, 2023, 10:23 AM IST

Updated : Jun 23, 2023, 10:55 AM IST

IPPB Recruitment 2023 : బ్యాంకు ఉద్యోగాల ఆశావహులకు గుడ్​ న్యూస్​. ఇండియన్​ పోస్ట్​ పేమెంట్స్​ బ్యాంకు (ఐపీపీబీ) ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 2023 జులై 3లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..

Bank Jobs 2023
IPPB Recruitment 2023 for 43 Executives

IPPB Recruitment 2023 : బ్యాంకు ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఇండియన్​ పోస్ట్​ పేమెంట్స్​ బ్యాంకు (ఐపీపీబీ) 43 ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్​​ టెక్నాలజీ అఫీసర్​ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు

  • ఎగ్జిక్యూటివ్​ (అసోసియేట్​ కన్సల్టెంట్​ - ఐటీ) - 30 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్​ (కన్సల్టెంట్​ - ఐటీ) - 10 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్​ (సీనియర్​ కన్సల్టెంట్​ -ఐటీ) - 03 పోస్టులు

విద్యార్హతలు
అభ్యర్థులు కంప్యూటర్​ సైన్స్​ లేదా ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీలో బీఈ/ బీటెక్​ చేసి ఉండాలి. లేదా 3 ఏళ్ల వ్యవధి గల మాస్టర్​ ఆఫ్​ కంప్యూటర్​ అప్లికేషన్స్​ (ఎమ్​సీఏ) చేసి ఉండాలి.

వయోపరిమితి - అనుభవం

  • ఎగ్జిక్యూటివ్​ (అసోసియేట్​ కన్సల్టెంట్​ - ఐటీ) అభ్యర్థుల వయస్సు 24 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ ఉద్యోగానికి కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
  • ఎగ్జిక్యూటివ్​ (కన్సల్టెంట్​ - ఐటీ) అభ్యర్థుల వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
  • ఎగ్జిక్యూటివ్​ (సీనియర్​ కన్సల్టెంట్​ -ఐటీ) ఉద్యోగాలకు 35 నుంచి 45 ఏళ్ల మధ్యలో వయస్సు ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులకు కనీసం 6 ఏళ్లు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుము ఎంత చెల్లించాలి?
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీల అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. అయితే ఒక సారి చెల్లించిన రుసుము తిరిగి రిఫండ్​ కాదు.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ?
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే ఇంటర్వ్యూతో పాటు అసెస్​మెంట్​, గ్రూప్​ డిస్కషన్​, ఆన్​లైన్​ పరీక్ష నిర్వహించడం అనేది ఇండియన్​ పోస్ట్​ పేమెంట్స్​ బ్యాంకు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

జీతభత్యాల వివరాలు

  • ఎగ్జిక్యూటివ్​ (అసోసియేట్​ కన్సల్టెంట్​ - ఐటీ)లకు సంవత్సరానికి రూ.10,00,000 వరకు జీతభత్యాలు అందిస్తారు.
  • ఎగ్జిక్యూటివ్​ (కన్సల్టెంట్​ - ఐటీ) అభ్యర్థులకు సంవత్సరానికి రూ.15,00,000 వరకు జీతభత్యాలు ఉంటాయి.
  • ఎగ్జిక్యూటివ్​ (సీనియర్​ కన్సల్టెంట్​ -ఐటీ) ఉద్యోగులకు సంవత్సరానికి రూ.25,00,000 జీతం ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ
ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఆసక్తి గల అభ్యర్థులు 2023 జులై 3లోగా అధికారిక వెబ్​సైట్​ https://www.ippbonline.com/ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

Last Updated : Jun 23, 2023, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.